English | Telugu

సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి..మీతో మీరు మాట్లాడండి!

మిర్చి మాధవి అందరికీ తెలిసిన ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో చేసి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి పెద్దమ్మగా నటిస్తోంది. ఇక ఇప్పుడు "బోళా శంకర్" మూవీలో చిరంజీవితో కలిసి మొదటిసారిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువన్న విషయం పక్కన పెడితే అందరినీ ఆత్మీయంగా పిలుస్తారు. అది చాలా నచ్చుతుంది. నన్ను కూడా పేరు మర్చిపోకుండా ఆప్యాయంగా పిలుస్తారు. ఇక చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన ఈ వయసులో కూడా ఎంతో గ్రేస్ తో యాక్ట్ చేశారు దానికి నేను ఫిదా ఐపోయాను అంటూ చెప్పింది మాధవి. అలాగే తన లైఫ్ జర్నీలో ఎన్నో అవాంతరాలను, అపార్థాలను దాటుకుని వచ్చానని, అందరూ తనని సెల్ ఫిష్ అని, పొగరని అనుకున్నా తానెప్పుడూ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లు చెప్పింది.

ఇక తనకు తమ ఫామిలీ అంటే వీక్నెస్ అని ఫామిలీతో స్పెండ్ చేయకుండా అస్సలు ఉండలేనని చెప్పింది. అలాగే చాలామందికి చాలా వీక్నెస్ లు ఉంటాయి. వాటిని అధిగమించాలి. అలా చేయలేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. అలాంటి వాళ్లకు ఒక సజెషన్ కూడా ఇచ్చింది మాధవి. సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా మనకు మనం మాట్లాడుకోకపోతే మన మెదడు మన ఆలోచనలని డైవర్ట్ చేసేస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా మనతో మనం మనలో మనం మాట్లాడుకోవాలి ముందు అని చెప్పింది. మనకై మనం ఈ భూమ్మీదకు రాలేదు కాబట్టి మనకై మనం మన జీవితం ముగించుకోకూడదు ఎందుకంటే ఆ రైట్ మనకు లేదని చెప్పింది. ఇక తన కెరీర్ లో పెద్దగా సంపాదించి దాచింది ఏమీ లేదని వచ్చినవన్నీ ఖర్చులకే ఐపోయేవి అని వివరించింది.

అంతా సాఫీగా వెళ్తుంది అనుకునే టైంలో రీసెంట్ గా ఐదు లక్షలు నష్ట పోవాల్సి వచ్చిందని అది కూడా తెలిసిన వాళ్ళ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెడతానని అడిగితే ఇచ్చానని... కానీ నమ్మిన వాళ్ళే మోసం చేసారని ఫీలయ్యింది మాధవి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.