English | Telugu

అనాథ‌లా వదిలేశారు.. డ‌బ్బుల కోసం స్టేజ్ షోలు చేశా!

'హిట్లర్ గారి పెళ్లాం', 'దేవత' వంటి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి మధు కృష్ణ. 'భలే భలే మగాడివోయ్', 'సరైనోడు' వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది. దాదాపు 1300కి పైగా స్టేజ్ షోలు చేసిన యాంకర్ గా కూడా సత్తా చాటిన ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అవుతుంది. పదేళ్ల వయసులోనే తన తండ్రి చనిపోయాడని, అప్పటికి తన తల్లి వయసు పాతికేళ్లు కావడంతో తనను విడిచి పేరెంట్స్ తో వెళ్లిపోయిందని చెప్పింది.

దీంతో అనాథ‌లా మారిన మధుకృష్ణను తాతయ్య, నాన్నమ్మలు పెంచారట. కొన్నాళ్లకు వాళ్లు కూడా చనిపోవడంతో ఒంటరిగా బతకాల్సి వచ్చిందని.. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అంటూ తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తాతయ్య, నానమ్మ, చుట్టుపక్కల వారి సహాయంతో డిప్లొమా వరకు చదువుకున్నానని చెప్పిన మధుకృష్ణ.. డబ్బుల కోసం స్టేజ్ షోలు మొదలుపెట్టానని గుర్తు చేసుకుంది. భయం, బాధ రెండూ వెంటాడేవని.. చదువు మధ్యలో ఆపకూడదనే ఆలోచనతో స్టేజ్ షోలు చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.

లోపల బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉండేదాన్ని అని.. మెల్లగా యాంకరింగ్ మొదలుపెట్టి.. తొమ్మిదేళ్లలో 1300కి పైగా స్టేజ్ షోలు చేశానని తెలిపింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని.. కాలేజ్ కు వెళ్తూనే స్టేజ్ షోలు, ఈవెంట్స్ చేశానని.. అలానే బీటెక్ పూర్తి చేశానని చెప్పింది. ఎంటెక్ కూడా మొదలుపెట్టానని కానీ మధ్యలోనే మానేశానని అంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నా.. ఒంటరి అని బాధ పడకుండా.. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగానంటూ తన గతాన్ని చెప్పుకొచ్చింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.