English | Telugu

లహరి న్యూ బేబీ బంప్...న్యూ ఫీలింగ్స్!

బుల్లితెర నటి లహరి అంటే తెలియని వారు ఉండరు. ‘చక్రవాకం’తో సీరియల్‌ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది. ‘మొగలిరేకులు’, ‘శ్రావణ సమీరాలు’ ‘రాధ మధు’, ‘పుట్టింటి పట్టుచీర’ వంటి సీరియల్స్ లో నటించింది. ‘కల్యాణ తిలకం’ లో చేసిన డ్యూయల్ రోల్ కి అలాగే ‘ముద్దుబిడ్డ’ సీరియల్ కి అవార్డ్స్ అందుకుంది ఇంకా ‘రాధ మధు’ సీరియల్‌కి నంది అవార్డు కూడా దక్కింది. ‘పక్కింటి అమ్మాయి, అత్తో అత్తమ్మ కూతురో, మమతల కోవెల, గోకులంలో సీత ఇలా ఎన్నో సీరియల్స్ లో నటనకు స్కోప్ ఉన్న రోల్స్ లో చేసింది. కందిరీగ, డాన్‌ సీను, ఆరెంజ్, గ్రీకువీరుడు, రారా కృష్ణయ్యా వంటి మూవీస్ లో లో కనిపించింది. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన ఫాన్స్ కి, నెటిజన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు లహరి ఆమె భర్త ధీరేన్.

తన బేబీ బంప్ ని ఈ వీడియోలో చూపించింది. ఈ విషయం గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకుంటోందట అలాగే డిఫరెంట్ వెరైటీస్ స్వీట్స్ తింటోందట అలాగే కాఫీ స్మెల్ పడడం లేదు అని కాఫీ కూడా తాగడం లేదట. ఆడపిల్ల పుడితే బెస్ట్ అని లహరి హస్బెండ్ ధీరేన్ చెప్పాడు. అమ్మాయి పుడితే తన మేకప్ సామాన్లు, డ్రెస్సులు, జ్యువెలరీ అన్నీ ఇచ్చేస్తుందట.. "మాకు మొదటి బిడ్డ కాబట్టి నాకు అమ్మాయి ఐనా అబ్బాయి ఐనా ఎవరైనా ఓకే" అని చెప్పింది లహరి. "నా బేబీ బంప్ చూసారు కదా నాకు ఎన్ని మంత్స్ ఉంటాయో మీరు గెస్ చేసి చెప్పండి" అంటూ నెటిజన్స్ కి ఒక టాస్క్ ఇచ్చింది లహరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.