English | Telugu

మురారికి అందరిముందు ముకుంద ప్రపోజ్ చేయనుందా?!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ.. ఎపిసోడ్-83 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో.. మురారి, కృష్ణది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి పట్టరాని సంతోషంలో ఉన్న ముకుంద.. ఇంట్లో అందరికి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. ఇక మురారి టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్లి డల్ గా కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన కృష్ణ.. "ఏంటీ ఏసీపీ సార్.. డల్ గా ఉన్నారు. ఓ ఈ రోజు వాలెంటైన్స్ డే కదా.. మీకు గర్ల్ ఫ్రండ్ ఉందా" అని కృష్ణ అడిగేసరికి మురారి షాక్ అవుతాడు. "ఓ.. లేదా అందుకే డల్ గా ఉన్నారా?" అని అడుగుతుంది. "మరి నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?" అని మురారి అడగడంతో.. "హా ఉన్నాడు శివన్న" అని కృష్ణ చెప్పేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక స్టేషన్ కి బయలుదేరుతున్న మురారిని ఆపి.. మనం భార్యభర్తలం కాకపోయినా.. "హ్యాపీ వాలెంటైన్స్ డే"అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక బయల్దేరి మురారి కార్ లో కూర్చునేసరికి పక్క సీట్ లో ముకుంద ఉంటుంది.

"ముకుందా.. నువ్వు ఏంటీ ఇక్కడ.. ఎవరైనా చూస్తే బాగోదు" అని మురారి అంటాడు. "నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు వాలెంటైన్స్ డే రోజు మంచి న్యూస్ చెప్పావు" అంటుంది ముకుంద. "నీకు ఈ రోజు సర్‌ప్రైజ్ ఉంది. ఇంట్లో అందరి ముందు రోజ్ ఇచ్చి.. హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్తాన"ని ముకుంద అనడంతో.. మురారి కంగారు పడుతుంటాడు. ఇక ముకుంద ఇంటికి, మురారి స్టేషన్ కి వెళ్ళిపోతారు.

పోలీస్ స్టేషన్‌లో.. ఒకతన్ని కానిస్టేబుల్ కొడుతుంటే మురారి అపుతాడు. "ఏం చేసాడు ఎందుకు కొడుతున్నారు?" అని అడుగుతాడు. సర్.. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్తున్నాడని కానిస్టేబుల్ అనేసరికి.. "అతన్ని వదిలెయ్యండి" అని మురారి చెప్తాడు. ఇక ముకుంద ఏం ప్లాన్ చేస్తుంది.. ఎలాగైనా ఆపాలని ముకుందకి మురారి ఫోన్ చేస్తాడు. ముకుంద ఏం ప్లాన్ చెయ్యనుంది? అందరి ముందు హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పనుందా? వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుందా.. ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.