English | Telugu

Guppedantha Manasu : దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మను.. వసుధారకి నిజం తెలిసిపోయిందిగా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1020 లో... అందరు కాలేజీలో పోస్టర్ చూస్తుంటే అప్పుడే వసుధార వచ్చి.. ఏమైందని కొంతమంది స్టూడెంట్స్ ని అడుగుతుంది. మీ పోస్టర్లు ఎవరో వేశారని చెప్పగానే వసుధార వెళ్లి చూసి షాక్ అవుతుంది. అక్కడ రాజీవ్ అంటించిన మను, వసుధారల ఫోటో కాకుండా వసుధర అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అని పోస్టర్ లో రాసి ఉంటుంది.

ఆ తర్వాత ఆ పోస్టర్లు శైలంద్ర చూసి షాక్ అవుతాడు. రాజీవ్ అంటించిన పోస్టర్లు కాకుండా వసుధారది ఉండడంతో వెంటనే రాజీవ్ కి ఫోన్ చేస్తాడు. మరొకవైపు శైలేంద్ర ఫోన్ చేసేది గుడ్ న్యూస్ చెప్పడానికే అనుకొని రాజీవ్ ఎక్సయిట్ అవుతు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కానీ శైలేంద్ర అక్కడ జరిగింది చెప్పడంతో రాజీవ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత వసుధర మేడమ్.. ఆ పోస్టర్లు చూసి చాలా సీరియస్ అయ్యారంట అది మనమే వేసామని తెలిస్తే ఏం అంటారో అని మను యొక్క పిఏ మనుతో అంటుంటే.. విషెస్ చెప్పాము అంతే కదా.. అందులో తప్పు ఏం ఉందని మను అంటాడు. వాళ్ళ మాటలు వసుధార వింటుంది. ఆ తర్వాత మను దగ్గరికి వసుధార వచ్చి.. ఎందుకు ఇలా చేశారంటూ సీరియస్ అవుతుంది. అందులో తప్పేం ఉంది. మీపై గౌరవంతో అలా చేసానని మను అంటాడు. ఇంకొకసారి అలా చెయ్యకండి. ఆ పోస్టర్లు తీసేయించండని వసుధార ఆర్డర్ వేస్తుంది. వాళ్ళ మాటలు అనుపమ మహేంద్ర ఇద్దరు వింటారు‌.

ఆ తర్వాత రాజీవ్ ని శైలేంద్ర తీసుకొని వచ్చి పోస్టర్ చూపిస్తాడు. అదేంటి నేను అంటించిన పోస్టర్లు తీసి ఇవి ఎవరు పెట్టారని రాజీవ్ అంటాడు. అప్పుడే మను వచ్చి నేను చేసానని అంటాడు. నేను వసుధార మేడమ్ బర్త్ డే పోస్టర్లు వేయించడానికి వెళ్ళాను. అక్కడ నువు ఉన్నావ్.. విషయం తెలుసుకొని నువ్వు అంటించేటప్పుడు వీడియో తీసాననే విషయం మను గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.