English | Telugu

శ్రీసత్య ఎమోషనల్ జర్నీ.. ఓటింగ్ కి ప్లస్ పాయింటా!

బిగ్ బాస్ ఫినాలే వీక్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకుంటుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి వారం నుంచి నిర్వహించిన టాస్క్ లు, వాటికి సంబంధించిన వస్తువులను గార్డెన్ ఏరియాలో పెట్టి, లాంతరు దీపాలతో అలంకరించాడు. ఫినాలేలో ఉన్న కంటెస్టెంట్ కి.. తను హౌస్ లో గడిపిన ముఖ్యమైన క్షణాలను ఫోటో రూపంలో బంధించి, గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు.

అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదట రేవంత్ జర్నీ వీడియోని బిగ్ బాస్ ప్లే చేయగా, రెండవ వీడియో శ్రీసత్యది కావడం విశేషం. ఆ తర్వాత బిగ్ బాస్, శ్రీసత్యని గార్డెన్ ఏరియాకి పిలిచి.. ఆమెకి సంబంధించిన ఫొటోస్ ని, ఇంకా తను హౌస్ లో గడిపిన మధురమైన క్షణాలన్నింటిని ఫోటోలుగా చూపించాడు. బిగ్ బాస్ మాట్లాడుతూ, "ఈ హౌస్ లోకి మీరు భయంతో అడుగుపెట్టి, ఎవరికి దగ్గర కావాలో తెలియని సంకోచంలో ఉన్నారు. మీ అమ్మ కోసం మీరు బిగ్ బాస్ కి వచ్చారని మీకు మీరే సర్ది చెప్పుకొని ముందుకెళ్ళారు. మీ ప్రయాణం లో, మీ జర్నీని సులభతరం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. కష్టం వచ్చిన ముందుకెళ్లగలగాలి. మీరు అలా ఒంటరితనం నుండి హౌస్ లో, అందరితో కలిసి ముందుకెళ్ళారు. ఇలాగే జీవితంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్ ది బెస్ట్" అని చెప్పాడు.

శ్రీసత్య తన జర్నీ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయింది. వీడియో ప్లే అవుతున్నంత సేపు ఏడ్చేసింది. అయితే అక్కడ డెకరేట్ చేసిన దీపకాంతలు.. తనని ఎంతగానో అబ్బురపరిచాయి. శ్రీసత్య జర్నీ వీడియోకి చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్‌ తో శ్రీసత్యకి ఓటింగ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.