English | Telugu

'ప్రతీ రోజూ వాలెంటైన్ డేలా ఉండాలి' అన్న శ్రేయ!

వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకోవడానికి బుల్లితెర కూడా రెడీ ఐపోయింది. ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్రోమోస్ ని విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ డేని లవర్స్ కి మరింత స్పెషల్ గా ఉండడం కోసం ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ పేరుతో స్పెషల్ షో నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో మొత్తం సీరియల్ జోడీస్, రియల్ జోడీస్ అందరూ కనిపించారు. నూకరాజు-ఆసియా, నిఖిల్ విజయేంద్రసింహా-సుప్రీతా ఇలా చాలా మంది కనిపించారు. హోస్ట్ గా ప్రదీప్ కూడా రండి ప్రేమలో పడదాం అంటూ ఎంటర్టైన్ చేసాడు. సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవారు సైతం వారి వారి జంటలతో పాల్గొన్నారు. నూకరాజు ఆసియాకి రింగ్ పెట్టాడు. తన గుండెల మీద పొడిపించుకున్న పచ్చబొట్టుని తడిమి చూసింది ఆసియా..ఎన్ని కష్టాలు వచ్చినా నీ చేయి వదిలిపెట్టను అని నూకరాజు తన మనసులో భావాన్ని చెప్పాడు.

అలా వాళ్ళు స్టేజ్ పైనే ప్రపోజ్ చేసుకున్న తర్వాత.. యాదమ్మ రాజు యూఎస్ లో ఉన్న తన భార్య స్టెల్లాతో వీడియో కాల్ లో మాట్లాడాడు. లైవ్ లోనే యాదమ్మ రాజు స్టెల్లాకి లవ్ యూ చెప్పాడు. ఆ మాటకు తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది స్టెల్లా. ఇక ప్రోమో చివరిలో శ్రేయ ఆమె హస్బెండ్ వచ్చారు..స్టేజి మీదే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. "ప్రతీ రోజూ వాలెంటైన్ డేలా ఉండాలి" అని చెప్పింది శ్రేయ .

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.