English | Telugu

సుధీర్ కి స్రవంతికి మధ్య అన్ని ఐపొయట..మరి రష్మీ

ఫ్యామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఉండగా ఆయన్ని, అలాగే వచ్చే టీమ్ మెంబర్స్ ని అలరించడానికి అన్నట్టు స్రవంతి చొక్కారావు, భానుశ్రీ ఇద్దరు సుధీర్ కి మరదళ్ళుగా ఉంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రాబోయే వారం ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మరదళ్ళు కలిసి సుధీర్ ని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతూ ఉన్నారు. ఈ షోకి "భలే ఉన్నాడే" మూవీ ప్రొమోషన్స్ కోసం స్పెషల్ గెస్ట్ గా హీరో రాజ్ తరుణ్ వచ్చాడు. "నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను వదిలేసేలా ఉన్నావ్ గాని నేను నా ఫామిలీని పిలిపించి తాంబూలాలు ఇప్పించేస్తా ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం" అని సీరియస్ గా చెప్పింది భానుశ్రీ.

దానికి స్రవంతి ఒక అడుగు ముందుకు వేసి "మనకన్నీ జరిగిపోయాయి కదా బావా" అనేసరికి సుధీర్ ఒక్కసారి ఉలిక్కిపడి ఎగిరి గంతేసాడు. ఇక కలిసుందాంరా వెర్సెస్ శతమానంభవతి సీరియల్ టీమ్స్ స్టేజి మీదకు వచ్చాయి. ప్రోమో ఫైనల్ లో "భలే ఉన్నాడే" మూవీ హీరోయిన్ మనీషా కందుకూరుని సుధీర్ ఒక ప్రశ్న అడిగాడు. "మేడం మీ లైఫ్ లో ఎవరినైనా చూసినప్పుడు భలే ఉన్నాడే" అనిపించిందా అని అడిగాడు. "మిమ్మల్ని చూసాకే అనిపించింది" అని సుధీర్ ని చూసి చెప్పింది మనిషా. దానికి సుధీర్ ఫ్లాట్ ఐపోయాడు. ఇలా ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.