English | Telugu

Jayam serial : పారుని ఇంట్లోకి తీసుకొచ్చిన శకుంతల.. గంగకి టెన్షన్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -186 లో....రుద్రకి దగ్గరగా ఉండాలని పారు ప్లాన్ చేస్తుంది. పారుని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. పారుని జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటే ఏమైంది సిస్టర్ పారుని అలా పట్టుకొని వస్తున్నారని ఇందుమతి అడుగుతుంది. తనకి ఒంట్లో బాగోలేదు కళ్ళు తిరిగిపడిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సెలైన్ కూడా ఎక్కించారు. వాళ్ళ అన్నయ్య ఊళ్ళో లేడు. అందుకే పారుని మన ఇంటికి తీసుకొని వచ్చానని శకుంతల అంటుంది. పారుని తీసుకొని రావడం ఇంట్లో ఎవరికి నచ్చదు.

అది వచ్చింది ఒంట్లో బాలేక కాదు.. నా కాపురంలో చిచ్చు లు పెట్టడానికి అని గంగ అనుకుంటుంది. ప్రమీల జ్యూస్ తీసుకొని రా అని శకుంతల చెప్తుంది. ప్రమీల వెళ్లి శకుంతలకి ఇస్తుంది. తాగు పారు అని శకుంతల జ్యూస్ ఇస్తుంటే.. నీరసంగా ఉన్నాట్లు యాక్టింగ్ చేస్తుంది పారు. దాంతో శకుంతల తాగిపిస్తుంది. బాక్సింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు టైమ్ కి తినాలి ఆరోగ్యంగా ఉండాలని ఇందుమతి భర్త చెప్తాడు. అన్నయ్య ఎప్పుడు బిజీగా ఉంటాడు.. నన్ను ఎవరు చూసుకుంటారు అంకుల్ అని పారు అంటుంది. అందుకేగా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందని శకుంతల అంటుంది.

ఆ తర్వాత పారు ఇక్కడ ఎందుకు అత్తయ్య అని ప్రమీల అంటుంది. అవునని గంగ అంటుంది. ఓహ్ నా నిర్ణయానికి ఎదురు చెప్తున్నావన్న మాట అని శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి నీ నిర్ణయానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు.. పారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండనివ్వండి అని రుద్ర చెప్తాడు. ఇక పారు హ్యాపీగా ఉండగా గంగ కుళ్ళుకుంటుంది.
ఆ తర్వాత పారు ఎవరు చూడకుండా కిచెన్ లోకి వెళ్లి అన్నం తింటుంది. అప్పుడే గంగ వాటర్ తాగడానికి కిచెన్ దగ్గరికి వస్తుంది. పారు బిర్యానీ తినడం చూస్తుంది గంగ. తన దగ్గరికి వచ్చిన గంగ.. నీకు ఆరోగ్యం బాలేదు అన్నారు మరి బిర్యానీ లాగిస్తున్నావ్ అగు రుద్ర సర్ వస్తున్నారు కదా చూపిస్తానని గంగ అనగానే త్వరగా పారు తన చేతిలో ఉన్న ప్లేట్ ని గంగ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత డ్రామా మొదలెడుతుంది పారు. అయితే ఇక్కడ రుద్ర ముందు గంగని ఇరికిస్తుంది పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.