English | Telugu

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

వాళ్ళకి కూడా గంగ కరెక్ట్ గానే సమాధానం చెప్తుంది. మరొకవైపు రుద్ర బయట టీ స్టాల్ దగ్గర ఉంటాడు. అక్కడ ఒకతను రుద్రని గుర్తుపట్టి మాట్లాడుతాడు. మీ వల్లే నేను ఇలా ఉన్నాను సర్.. మీరు పోటీలో ఉంటే మాకు చాలా ఆసక్తిగా అనిపించేది.. మిమ్మల్ని ఎవరు బీట్ చెయ్యలేరు సర్ మీ పంచ్ పవరే వేరు అని రుద్ర గురించి అతను చాలా గొప్పగా చెప్తాడు. మరొకవైపు గంగ సెలక్షన్ లో పాల్గొనకుండా పారు ప్లాన్ చేస్తుంది. తనపై కూల్ డ్రింక్ పడేలా చేస్తుంది. దాంతో క్లీన్ చేసుకోవడానికి గంగ వెళ్తుంది. గంగ వెళ్ళగానే పారు బయట నుండి డోర్ పెడుతుంది. గంగ డోర్ తియ్యమని ఎంత అరిచినా ఎవరు డోర్ తియ్యరు. మరొక పక్క సెలక్షన్ కి టైమ్ అయిపోతుంది.

అప్పుడే సెక్యూరిటీ డోర్ తియ్యగా గంగ వచ్చి తన పేరు చెప్తుంది. ఏమైందని అక్కడున్న వాళ్ళు అడుగగా ఎవరో బయట నుండి గడియ పెట్టారని గంగ చెప్తుంది. తన పేరుని గంగ చెప్తుంది. దాంతో మైక్ లో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్ అని చెప్పగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు గంగ, రుద్ర ఇద్దరు సెలక్షన్ ప్రాసెస్ కి వెళ్ళారని శకుంతలకి ఇషిక, వీరు చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.