English | Telugu

కొత్త అల్లుడిని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -69 లో.. స్వప్నకి తన ఫ్రెండ్ ఇంట్లో అవమానం జరగడంతో రాహుల్ కి ఫోన్ చేస్తుంది. స్వప్న ఫోన్ చేస్తుందని రాహుల్ తిట్టుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేస్తున్నాడేంటి.. లాభం లేదు నేరుగా ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను.. ఇక ఈ అవమానాలన్ని భరించలేనని స్వప్న అనుకుంటుంది.

మరోవైపు అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడికి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకుంటారు కనకం ఫ్యామిలీ. అన్ని రకాల వంటలు చేస్తారు. మన ఇంటి ఛాయలకు కూడా రాడనుకున్న అల్లుడు.. నిన్ను తీసుకొని వచ్చాడని కనకం సంబరపడుతుంది. ఆడపిల్ల అత్తారింట్లో బాగుండాలంటే.. ఇలా అల్లుడు వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మా అత్త మామలను నొప్పించకూడదని కూతురిని అత్తారింట్లో అల్లుడు బాగా చూసుకుంటాడు. అయినా ఒకసారి ఒకరి ఇంట్లో భోజనం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకొనే సంస్కృతి మనదని కృష్ణమూర్తి అంటాడు. ఇక రాజ్ ప్యాంటుపై అప్పు ఐస్ క్రీం పడెయ్యడంతో రాజ్ లుంగీ కట్టుకుంటాడు. లుంగీలో రాజ్ ని చూసి కావ్య షాక్ అవుతుంది. అన్ని వంటలు చూసి రాజ్ షాక్ అవుతాడు. కింద కూర్చోవాలా డైనింగ్ టేబుల్ లేదా అని రాజ్ అడుగుతాడు. లేదు బాబు అని మీనాక్షి అంటుంది.

మరోవైపు అపర్ణ దగ్గరికి రుద్రాణి వెళ్ళి.. కావ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి లేనిపోనివి చెప్తుంది. ఇప్పుడే కావ్య చెప్పినట్లు రాజ్ వింటున్నాడని రుద్రాణి అనగానే.. నా కొడుక్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని అపర్ణ అంటుంది. వాళ్ళ మర్యాదలతో రాజ్ ని వాళ్ళ వైపుకి తిప్పుకుంటారు. కావాలంటే నేను వీడియో కాల్ చేస్తున్నా చూడమని రాజ్ కి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్ ఫోన్ కావ్య దగ్గర ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి రాజ్ తో పాటుగా, అతని ముందు ఉన్న వంటలు అన్ని చూపిస్తుంది కావ్య. రాజ్ ని లుంగీలో చూసి.. ఆ లుంగీ ఏంటి రాజ్ అని అడుగుతుంది. నేను తర్వాత చేస్తా మమ్మీ అని రాజ్ కట్ చేస్తాడు. ఆ తర్వాత అవి తినండి అల్లుడు గారు, ఇవి తినండంటూ మీనాక్షి, కనకంలు హడావిడి చేస్తారు.

మరోవైపు స్వప్న దుగ్గిరాల ఇంటి ముందుకు వస్తుంది. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ స్వప్నని ఆపేస్తాడు. దాంతో రాహుల్ కి స్వప్న ఫోన్ చేసి.. మీ ఇంటి ముందే ఉన్నానని స్వప్న చెప్పగానే.. రాహుల్ బయటకు వచ్చి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.