English | Telugu

బిగ్ బాస్ లో ప్రియాంక జైన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


ప్రియాంక జైన్ అలియాస్ జానకి.. ముద్దుగా అమ్ములు అని పిలుస్తారు. తన పేరు కంటే తను నటించిన పాత్ర ద్వారానే ఎక్కువ ఫేమ్ లోకి వచ్చింది ప్రియాంక జైన్. 'మౌనరాగం' సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయమైంది. ఆ సీరియల్ లో అమ్ములు పాత్రలో మూగ అమ్మాయిగా తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మా టీవీలో ప్రసారమై తాజాగా పూర్తయిన 'జానకి కలగనలేదు' సీరియల్ లో అమర్ దీప్ తో జతకట్టి తన యాక్టింగ్ తో అందరిని మెప్పించింది.

ప్రియాంక జైన్ ముంబైలో జన్మించింది. తనకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రస్ట్ తో, మొదట మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తమిళ్ లో 'రంగ్ తరంగ్' మూవీలో నటించింది. కన్నడలో 'గోళీసోడా', తెలుగు లో 'చళ్తే చళ్తే' మూవీలో నటించింది. అందులో అంతగా గుర్తింపు రాకపోవడంతో మా టీవీలో ప్రసారమైన మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిందని చెప్పొచ్చు. ఆ సీరియల్లో హీరో శివ కుమార్ తో ప్రియాంక ఫ్రెండ్ షిప్ మొదలయింది. కాగా ఇప్పుడు ఇద్దరు ప్రేమికులుగా మరిపోయారు. ప్రియాంక, శివకుమార్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి వ్లాగ్స్ చేయడంతో వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ప్రియాంక, శివకుమార్ లు ఇద్దరు కలిసి 'నెవర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానల్ ‌స్టార్ట్ చేశారు. అందులో ఇద్దరికి సంబంధించిన వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్-7 లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రియాంక జైన్ ని నాగార్జున సైతం.. 'నువ్వు వ్లాగ్స్ చేస్తావ్ కదా నేను చూశాను' అని అన్నాడు‌. ఇప్పుడు నువ్వు హౌజ్ లోకి వెళ్లి హౌజ్ అంతా చూపిస్తూ‌ స్పష్టంగా అదంతా వ్లాగ్ చేసి ఇవ్వాలని నాగార్జున చెప్పగానే.. ప్రియాంక షాక్ అవుతూ ఒకే సర్ అని చెప్పింది. ప్రియాంకకి బిగ్ బాస్ వాళ్ళు వారానికి రెండు లక్షల యాభై వేల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీరియల్ ద్వారా తన నటనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియాంక హౌజ్ లో ఎలాంటి వినోదాన్ని ఇస్తుందో? ఎలా గేమ్స్, టాస్క్ లు చేస్తుందో చూడాలి మరి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.