English | Telugu
Guppedantha Manasu : ఇంటరాగేషన్ లో శైలేంద్రకి చెమటలు.. ముకుల్ ఆన్ ఫైర్!
Updated : Dec 10, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-942 లో.. రిషి కోసం వెతికే పనిలో ఉన్న కానిస్టేబుల్ కి.. రిషి కార్ ఒక దగ్గర కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండకపోవడంతో కానిస్టేబుల్ ముకుల్ కి కాల్ చేసి రిషి సర్ కార్ ఇక్కడ ఉంది కానీ మనిషి ఎక్కడ కన్పించడం లేదని చెప్తాడు. ఎక్కడ అయిన అనమానస్పందంగా ఉందా అని ముకుల్ అడుగగా.. అదేం లేదని కానిస్టేబుల్ చెప్తాడు.
మరొకవైపు ముకుల్ వస్తున్నాడు. ఇక మీ బండారం బయటపెడతాడని వసుధార భయపెడుతుంది. దాంతో కంగారుగా శైలేంద్ర దగ్గరికి దేవయాని వచ్చి ఆ ముకుల్ వస్తున్నాడంట ఏమైనా ప్లాన్ చేశావా అని దేవాయని టెన్షన్ పడుతుంది. ఇప్పుడే వస్తున్నాడా అని శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి ముకుల్ వచ్చాడు. మిమ్మల్ని తీసుకోని రమ్మని చెప్పాడని అంటుంది. నేను తీసుకోని వస్తాను. నువ్వు వెళ్ళు అని దేవయాని చెప్తుంది. కానీ దేవయాని కోపంగా ముకుల్ దగ్గరికి వచ్చి.. శైలేంద్ర ఈ సిచువేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఇంటరాగేషన్ చేస్తారని దేవయాని అడుగుతుంది. ఇప్పుడు శైలేంద్ర నడవలేడని దేవాయని అనగానే.. హాస్పిటల్ నుండి వచ్చినవాడు ఇక్కడికి రాలేడా అని అనుపమ అంటుంది. మీరే అక్కడికి వెళ్ళండి అని వసుధార అనగానే.. నాకేం ప్రాబ్లమ్ లేదని ముకుల్ అంటాడు. ముకుల్ అక్కడికి వెళ్తే మర్యాద కాదు శైలేంద్ర రావడమే కరెక్ట్ అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి మహేంద్ర వెళ్లి తీసుకుని వస్తాడు
ఆ తర్వాత ముకుల్ ఒక్కొక్కటిగా అన్ని విషయాలు అడుగుతుంటే ఒకవైపు శైలేంద్ర, మరొకపక్క దేవయానిలలో వణుకుపుడుతుంది. సారథి ఎలా తెలుసు? ఎమ్ఎస్ఆర్ ఎలా తెలుసు? ఇలా ముకుల్ అడుగుతుంటే శైలేంద్ర సమాధానం, మాటల్లో తడబడుతు చెప్తాడు. ఇదంతా ఎందుకని దేవయాని అడుగుతుంది. వాయిస్ పోల్చుకుంటున్నామని.. ముకుల్ ఆ వాయిస్ రికార్డుని వినిపించగానే అనుపమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది మా అయన గొంతే అని ధరణి అనుకుంటుంది. ఈ వాయిస్ మీదే అని ముకుల్ అంటు ఉంటే.. శైలేంద్ర సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.