English | Telugu

గౌతమ్ కి కొసరి కొసరి వడ్డించిన రేవతి.. భవానికి పెరిగిన కోపం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. కృష్ణ మీద కోపంతో‌ భవానీ ఆమెను ఇంటి నుండి బహిష్కరించగా.. తనేం తప్పు చేయలేదని నిరూపించుకోవాలని.. నందుకి ట్యాబ్లెట్లు ఇచ్చిన వాళ్ళ సీనియర్ డాక్టర్ ని ఇంటికి తీసుకొస్తుంది కృష్ణ. దీంతో ఏం జరుగుతుందా అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -118 సాగింది. గౌతమ్ సర్ ఇంటికి వస్తున్నారని భవానీతో చెప్తుంది కృష్ణ. "నందు టాబ్లెట్స్ విషయంలో నన్ను బ్లేమ్ చెయ్యడంలో సక్సెస్ అయింది ముకుంద.. నేను నందు టాబ్లెట్స్ విషయంలో ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికే గౌతమ్ సర్ ని రమ్మన్నాను" అని కృష్ణ ఇంట్లోవాళ్ళతో చెప్తుంది. ఇంతలోనే గౌతమ్ వస్తాడు. గౌతమ్ ని చూసిన భవాని, ఈశ్వర్, ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతారు. దాని తర్వాత గౌతమ్ ని కృష్ణ అందరికి పరిచయం చెద్దామని అనుకునేలోపే.. వద్దు కృష్ణమ్మ నేను గెస్ చేసి చెప్తానంటూ.. ఒక్కొక్కరి గురించి గౌతమ్ చెప్తాడు.

"ఆమె మీ పెద్ద అత్తయ్య భవాని దేవి.. ఈ ఇంటికి రాజమాత. వీళ్ళు ఈశ్వర్, ప్రసాద్ లు.. ఈ ఇంటికి రక్షక భటులని, ఆమె మీ చిన్న అత్తయ్య.. మీరు కృష్ణ ని కోడలు లా కాకుండా కూతురు లా చూసుకుంటారంట కదా.. ఇవ్వన్నీ కృష్ణ నాకు చెప్పింది" అంటాడు గౌతమ్. మురారిని బావ అని గౌతమ్ పిలుస్తాడు. మురారి షాక్ అవుతాడు. కృష్ణ నాకు చెల్లెలు కాబట్టి మురారి బావ అవుతాడని గౌతమ్ అంటాడు. వీళ్ళని నేను అపార్ధం చేసుకున్నానా అని మురారి బాధపడతాడు. ఇక అందరూ భోజనం చెయ్యడానికి వెళ్తారు. భవాని, ఈశ్వర్ ఇంకా ప్రసాద్ లు మాత్రం వెళ్లకుండా.. గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు. ఈ కృష్ణకి నందు గురించి తెలిసే తీసుకొచ్చిందా.. అసలు వాడికి ఎంత ధైర్యం ఈ ఇంటికి రావడానికి అని భవాని అంటుంది. నందు వాడిని చూడకూడదు.. కిందకి రాకుండా చూసుకోండని భవాని చెప్తుంది. మరోవైపు భోజనం చేస్తున్న గౌతమ్ కి.. అది వేసుకోండి, ఇది వేసుకోండి అల్లుడు గారని రేవతి అంటుంటే.‌. ఈశ్వర్ కి కోపం వస్తుంది. నందుకి టాబ్లెట్స్ నేనే ఇచ్చాను.. అందులో కృష్ణ తప్పేం లేదు.. ఎవరికో ఒకరికి మాత్రమే ఇలా అవుతుంది. నందు కి మెల్లి మెల్లిగా గతం గుర్తుకొస్తుందని గౌతమ్ చెప్తాడు. ఇక నందు పైనుండి కిందకి వస్తుంటే.. భవాని తనని చూసి ప్రసాద్.. నందు ని పైకి తీసుకెళ్ళు అని చెప్తుంది. నందుని ప్రసాద్ పైకి తీసుకెళ్లడం గౌతమ్, కృష్ణ చూసి ఎమోషనల్ అవుతారు.

ఆ తర్వాత భోజనం చేసి వెళ్తూ.. నందు కేసు ఒక్కటే ఇక మిగిలిందని గౌతమ్ అనగానే.. మాకు కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ లు నందుని చూసుకోవడానికి ఉన్నారు అని భవాని అంటుంది. ఇక వెళ్లిపోండని ఈశ్వర్ అంటాడు. గెస్ట్ లను ఎక్కువ సేపు మీ ఇంట్లో ఉండనివ్వరా అని చెప్పేసి గౌతమ్ వెళ్ళిపోతాడు. మురారి బాధపడుతుండగా.. కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.