English | Telugu

Krishna Mukunda Murari:తింగరి నీలో అమ్మ ఉంది.. అమ్మ అయితే చూడాలనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-395 లో.. ముకుంద, అదర్శ్ ఇద్దరు తమ గదిలో మాట్లాడుకుంటారు. మనమిద్దరం కాశ్మీర్ వెళ్ళిపోదామని ముకుందతో ఆదర్శ్ అనగానే.. ఆశ్చర్యపోయిన ముకుంద.. ఎందుకని అడుగుతుంది. ఆ మంచుకొండలు, ఆ లోయలు, ఆ అనుభూతే వేరు మనం కచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలని ఆదర్శ్ అంటాడు. అత్తయ్య మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు కదా అని ముకుంద అనగానే.. నేను కూడా అమ్మ ఇండియాకి వచ్చాకే వెళ్దామని అంటున్నా అని ఆదర్శ్ అంటాడు. ఇక ముకుంద ఆలోచనలో పడిపోతుంది.

నా మురారి ఉన్నచోట నాకు ప్రశాంతత.. నా మురారి లేని చోట స్వర్గం అయినా నాకు ప్రశాంతతనివ్వదని ముకుంద మనసులో అనుకుంటుంది. అయినవాళ్ళందరిని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్ళడం.. అత్తయ్య వచ్చాక జాబ్ ఏదో ఇక్కడే చూసుకుంటే అయిపోతుంది కదా అని ముకుంద అనగానే.. అదేదో అక్కడే చూసుకుంటే అయిపోతుంది కదా.. దాని గురించి నువ్వు వర్రీ కాకు.. మనసుకి నచ్చిన మనిషితో బ్రతకడం స్వర్గం.. అదే మనిషితో స్వర్గం లాంటి చోట బ్రతికితే మహాస్వర్గమని ఆదర్శ్ అంటాడు. ఇక అతడి మాటలు విని ముకుంద .. రోజు రోజుకి నా మీద ఎక్కువగా ఆశలు పెంచుకుంటున్నాడు లాభం లేదు నిజం చెప్పాలని ముకుంద అనుకుంటుంది. ఇక కృష్ణ, మురారి వారి గదిలో ఎప్పటిలాగే కాసేపు గొడవపడతారు. ఆ తర్వాత ప్రేమగా కలిసి ఉంటారు. ఎప్పుడు గిఫ్ట్ నువ్వు తీసుకోవడమేనా నాకెప్పుడైనా గిఫ్ట్ ఇచ్చావా అని మురారి అడుగగా.‌. రేపు, ఎల్లుండో త్వరలోనే మీరు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పి కృష్ట సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఇక మధు, రేవతి, నందు, మధు వాళ్ళ నాన్న అందరు కలిసి హాల్లో కబుర్లు చెప్పుతూ కాసేపు మధుని ఆడుకుంటారు. ఇక అప్పుడే అక్కడికి కృష్ణ, మురారీలు వస్తారు.

అక్కయ్య ఇచ్చిన గిఫ్ట్ లో ఏం ఉందని కృష్ణని రేవతి అడుగుతుంది. అవును కదా ఓపెన్ చేయలేదని కృష్ణ అనగా ఇంకా ఓపెన్ చేయలేదా అని మధు అంటాడు. ఇక ఆ తర్వాత అందరి ముందు ఓపెన్ చేయాలనుకున్నానని కృష్ణ చెప్పి అ గిఫ్ట్ ని తీసుకొస్తుంది. అది ఓపెన్ చేసి చూడగా అందులో ఓ చిన్నపాప బొమ్మ, లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో భవాని ఏం రాసి ఉంటుందంటే.. తింగరి నీలో అమ్మ. ఉంది‌. నువ్వు అమ్మ అవుతే చూడాలని ఉంది అని ఉంటుంది. ఇక ఆ లెటర్ మురారీ చదువుతుంటే కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇది నా ఒక్కదానికే కాదు ముకుందలకి కూడా అని కృష్ణ అంటుంది. పెద్దత్తయ్య మనిద్దరి దగ్గరి నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తుందో తెలుసా అని ముకుందని కృష్ణ అంటుంది. తింగరి అంటే నువ్వే కృష్ణ.. ముందు నువ్వే బిడ్డనివ్వాలని ముకుంద అంటుంది. ఆయన వచ్చాక ట్రిప్ కు వెళ్తే బాగుంటుందని కృష్ణని ముకుంద అడుగుతుంది. దాంతో అందరు హ్యాపీగా సరేనంటారు. ఆ ఫోటో సంగతేంటి? అసలు ముకుంద మనసులో నిజంగానే నాకు చోటు ఉందా అని ఆదర్శ్ తన మనసులో అనుకుంటాడు. కాసేపటికి భవాని పంపిన చిన్నపాప బొమ్మని తీసుకొని ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ముకంద, ఆదర్శ్, కృష్ణ, మురారీ కార్ లో వెళ్తుంటారు. థాంక్స్ ముకుంద మాకోసం అవుటింగ్ ప్లాన్ చేసినందుకు అని కృష్ణ అనగానే మీకోసం కాదు నాకోసం.. ఆదర్శ్ కి నిజం చెప్పడానికి ప్లాన్ చేశానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.