English | Telugu

Krishna Mukunda Murari:శ్రీధర్ ని చంపి కొత్త డ్రామా మొదలెట్టిన దేవ్.. వాళ్ళు కనిపెట్టగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -356 లో.. కృష్ణ తప్పు చేసిందని భవాని అనుకుంటుంది. అది అవాస్తవమని ఋజువు చేసే పనిలో మురారి ఉంటాడు. అలా ఋజువు చేసే క్రమంలో ఫెయిల్ అవుతుంటాడు. శ్రీధర్ వేసిన బొమ్మ సర్జరీ చేయించిన అతనిది కాదని పరిమళ చెప్తుంది. దాంతో అ శ్రీధర్ ఎందుకు అలా వేసాడోనని మురారి కృష్ణ ఇద్దరు అనుకుంటారు. ఎవరో కావాలనే మాన ఫ్యామిలీని కేసులో డైవర్ట్ చెయ్యడానికి ఇలా చేశారని మురారి అంటాడు.

ఆ శ్రీధర్ ఎందుకు అలా చేసాడో రేపు వాడిని నాలుగు కొట్టి నిజం చెప్పిస్తానని మురారి అంటాడు. మీకు నమ్మకం లేకపోతే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో మీరే, మీ ముందు ఇంట్రాగేషన్ చెయ్యించండని మురారి అంటాడు. మరుసటి రోజు ఉదయం పడుకున్న మురారి దగ్గరకి కృష్ణ వచ్చి సరదాగా ఆటపట్టిస్తుంది. ముకుంద లాగా మిమిక్రీ చేసి మురారిని నిద్ర లేపుతుంది. దాంతో ముకుంద వచ్చిందని అనుకుని మురారి కోపంగా నిద్ర లేస్తాడు. కృష్ణని చూసి.. ఏంటి కృష్ణ ప్రొద్దున్నే అని అంటాడు. ముకుందపై చాలానే కోపం ఉంది కదా.. మరి నాపై ప్రేమ ఎంత ఉందని కృష్ణ అడుగుతుంది. అప్పుడు కృష్ణ జుట్టుని చూపిస్తూ.. ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి ఉండాలని ఉందని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి అందరు హాల్లో కూర్చొని ఉంటారు. శ్రీధర్ ని వెళ్లి కలిసావా అని మురారిని భవాని అడుగుతుంది. లేదు ఇప్పుడు వెళ్తున్నాను.. ఎందుకు అలా చేసాడో కనుక్కుంటానని మురారి అనగానే.. ఎన్నిసార్లు వెళ్తే ఏంటి అని భవాని అంటుంది. అంటే నేను వెళ్లట్లేదు పట్టించుకోవట్లేదని అంటున్నారా అని మురారి అంటాడు.

కాసేపటికి దేవ్ తలకి కట్టుతో ఇంటికి వస్తాడు. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడుగగా.. శ్రీధర్ ని తీసుకొని రావడానికి వెళ్ళాను. అక్కడ రౌడీలు ఉన్నారు. నన్ను కొట్టారు స్పృహ తప్పి పొడిపోయాను. నేను లేచేసరికి శ్రీధర్ చనిపోయి ఉన్నాడని దేవ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అది విని ముకుందపై కృష్ణకి డౌట్ వస్తుంది. మరొకవైపు దేవ్ తో శ్రీధర్ గురించి మాట్లాడతాడు మురారి. నేరస్తుడిని పట్టుకుంటానని మురారి చెప్పగానే దేవ్ టెన్షన్ పడుతాడు. మరొకవైపు నిజం బయటకు రాకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళతోనే కలిసి ఉంటానంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరని భవాని అంటుంది. తరువాయి భాగంలో.. శ్రీధర్ కి సంబంధించిన ఫొటోస్ చూస్తూ అతని చెంపపై కొట్టడం.. వాళ్ళ హత్య చేసిన అతని వేలుకి ఉన్న రింగ్ అచ్చులు శ్రీధర్ చెంపపై ఉండడం.. కృష్ణ, మురారి గమనించి ముందు ఈ రింగ్ ఎవరికి ఉందో కనుక్కోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.