English | Telugu

Karthika Deepam2 : అడ్డంగా దొరికిపోయిన పారిజాతం.. ఆ ప్లాన్ కనిపెట్టేసిన కార్తీక్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -411 లో.....దీప ఇండైరెక్ట్ గా జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. తప్పు చేసి తప్పించుకోలేరు.. దాస్ బాబాయ్ వచ్చాక నిజాలన్నీ తెలుస్తాయి.. అప్పుడు శిక్ష తప్పక ఉంటుందని దీప అంటుంటే.. ఇదేంటి నిజం తెలిసి ఇలా అంటుందా అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీప వెళ్ళిపోయాక.. నేను అయితే నీ అంత మంచిదాన్ని అయితే కాదు దీప.. కేవలం నా సంతోషం కోసం మాత్రమే ఆలోచిస్తానని జ్యోత్స్న అనుకుంటుంది.

మరొకవైపు కాశీ రావడం గమనించిన స్వప్న.. మమ్మీ జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఇప్పుడు అయినా జరుగుతుందా అని కావేరిని అడుగుతుంది స్వప్న. జరగదు గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్న, పారిజాతానికి తెలుసు.. మళ్ళీ ఎంగేజ్ మెంట్ చెడిపోయేలా చేసి మళ్ళీ దీప మీదకి వచ్చేలా చెయ్యాలని ట్రై చేస్తున్నారు.. ఇదంతా వాళ్ళు మాట్లాడుకోవడం.. నేను విన్నానని కావేరి, స్వప్న చెప్తుంటే కాశీ అదంతా వింటాడు. అంటే నేనే జ్యోత్స్న అక్క మాటలు నమ్మి మోసపోయానా అని కాశీ అనుకుంటాడు. అన్నయ్య చెయ్యమన్నట్లు చేసానని స్వప్న అనుకుంటుంది. అక్కడే ఉండి కావేరి మాటలు విని శ్రీధర్ పారిజాతానికి ఫోన్ చేసి మాట్లాడతాడు. నన్ను ఎంగేజ్ మెంట్ కి పిల్వలేదని శ్రీధర్ అనగానే పారిజాతం ఫోన్ మాట్లాడుతు హాల్లోకి వస్తుంది. అసలు ఈ ఎంగేజ్మెంట్ జరగదని పారిజాతం అంటుంది. దాంతో అక్కడున్న వాళ్లంతా విని షాక్ అవుతారు. అయ్యో నేను మాట్లాడుతు ఇక్కడికి వచ్చానా అని పారిజాతం భయపడుతుంది. ఎంగేజ్ మెంట్ ఎందుకు జరగదు చెప్పమని శివన్నారాయణ కోప్పడతాడు. ఎందుకు జరగదు పారు అని కార్తీక్ అంటాడు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారని సుమిత్ర బాధపడుతుంది. ఎవరేం చేసినా నా మనవరాలు ఎంగేజ్ మెంట్ ఆగదని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు.

నా కూతురికి కాస్త దూరంగా ఉండు పిన్ని అని పారిజాతంతో దశరథ్ అంటాడు. ఆ తర్వాత కాశీ, స్వప్న ఇద్దరు దీప కార్తీక్ ని కలుస్తారు. జ్యోత్స్న చేస్తున్న ప్లాన్ గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. కాశీకి పది లక్షలు ఇస్తాడు కార్తీక్. నువ్వు జ్యోత్స్నకి హెల్ప్ చేస్తున్నావని అనుకుంటున్నాడు.. అలాగే ఉండనివ్వు మనకి నిజం తెలిసిపోయిందని తనకి తెలియొద్దు.. మనం కలిసి గ్రూప్ గా చెయ్యాలి.. జ్యోత్స్న తప్పించుకోవడానికి వీలు లేదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.