English | Telugu

Karthika Deepam2: దీప కోసం లాయర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్.. న్యాయం గెలుస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. మీరందరు వదిలేయాల్సింది నన్ను కాదు ఆ దీపని ఆ తర్వాత మనం ఒక మంచి ఇల్లు తీసుకొని సెటిల్ అవదామని శ్రీధర్ అంటుంటే.. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద గా ఉండదని శ్రీధర్ కి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అక్కడ ఈ కేసు తీసుకుంది భగవాన్ దాస్.. సీనియర్ లాయర్.. తనకి ఎదురు ఎవరు వెళ్ళలేరు. ఇక దీపకి కఠిన కారాగార శిక్ష పడుతుందని శ్రీధర్ హెచ్చరించి వెళ్తాడు.

ఆ తర్వాత కార్తీక్ ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. తన పేరు కళ్యాణ్ ప్రసాద్.. న్యాయం కోసం ఎంతగా అయిన పోరాడుతాడు అతని దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. ఏ పరిస్థితిలో దీపని పెళ్లి చేసుకున్నాడో ఆ తర్వాత జరిగిన సిచువేషన్ అంతా కార్తీక్ చెప్తాడు. సరే ఒకసారి మీ భార్య దీపని కలవాలని లాయర్ అంటాడు. నేను తన గురించి మొత్తం చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. అసలు ఏం జరిగిందని తను కూడా చెప్పాలి కదా అని లాయర్ అంటాడు.

మరొకవైపు జ్యోత్స్న భగవాన్ దాస్ దగ్గరికి వెళ్లి తన కేసు గురించి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ప్రసాద్ ని కార్తీక్ తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. ఈ కేసుకి ఆధారాలు చాలా ఇంపార్టెంట్ అని దీపతో లాయర్ మాట్లాడతాడు‌. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. లాయర్ ఉండడం చూసి బయట ఉంటుంది. లాయర్ వెళ్లిపోతుంటే జ్యోత్స్న లాయర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటుంది. మీరు ఈ కేసు ఎందుకు తీసుకున్నారు.. దీప తప్పు చేసిందని జ్యోత్స్న అంటుంది. నువ్వు నమ్మితే సరిపోదు కోర్ట్ కూడా నమ్మాలి న్యాయమే గెలుస్తుందని జ్యోత్స్నతో కళ్యాణ్ ప్రసాద్ అంటాడు‌. ఆ తర్వాత దీప, కార్తీక్ ల దగ్గరికి జ్యోత్స్న వెళ్లి వాళ్ళను రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. దీప కోపంతో సెల్ నుండే జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.