English | Telugu

Karthika Deepam2 : కట్టుబట్టలతో బయటకొచ్చేసిన కార్తీక్, దీప.. శివన్నారాయణ‌కి ఛాలెంజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -233 లో....ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో టిఫిన్ అమ్ముకునే దీప.. ఇప్పుడు ఏకంగా రెస్టారెంట్ ఓనర్ అవుతుంది. ఇది గొప్ప విషయం కదా అని శివన్నారాయణ అనగానే.. మీకు ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండండి అని కార్తీక్ అంటాడు. నా భార్య పేరు మీద రెస్టారెంట్ కడుతాను.. పెట్టుబడి ఏమైనా నిన్ను అడిగనా అని కార్తీక్ అనగానే.. పెట్టుబడి పెట్టడానికి దీప ఏం తాకట్టు పెట్టి నీకు ఇచ్చిందని శివన్నారాయణ అనగానే నా ఇల్లు బ్యాంక్ లో తాకట్టు పెట్టి పెట్టుబడి తీసుకుంటున్నానని కార్తీక్ అంటాటు. నీకు ఇల్లు ఎక్కడిది.. ఇవి నా ఆస్తులని శివన్నారాయణ‌ అంటాడు.

ఈ ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు నాది.. నువ్వు నా మీద గెలవాలనుకుంటే, నా అనేది లేకుండా ఉండి గెలువు.. అప్పుడే నువ్వు మొగాడివి అని ఒప్పుకుంటా అని శివన్నారాయణ అంటాడు. దాంతో ఆస్తుల పేపర్లని కార్తీక్ చింపేసి.. నీ ఆస్తి నాకు వద్దని అంటాడు. చింపినంత ఈజీ కాదు.. వద్దనుకోవడం.. ఇంట్లో ఉన్న ప్రతిదీ నాది.. నువ్వు వేసుకున్న బంగారంతో సహా అని శివన్నారాయణ అనగానే.. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నా భార్య పేరుపై రెస్టారెంట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ బెస్ట్ రెస్టారెంట్ అవార్డు అందుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. మరొకవైపు శివన్నారాయణ‌ వాళ్ళని ఏం అంటున్నాడో అని సుమిత్ర అనగానే.. దశరథ్ టెన్షన్ గా కార్తీక్ ఇంటికి వెళ్తాడు.

ఆ తర్వాత శివన్నారాయణ‌ మాటలకి.. మీ కూతురు ఎంత బాధపడుతుందో ఆలోచించారా అని దీప అంటుంది. ఆ తర్వాత కాంచన తన తండ్రి తన కొడుకుని తనని చిన్నచూపు చూస్తున్నందుకు ఏడుస్తుంది. మమ్మల్ని క్షమించాలంటే ఏం చెయ్యాలని కాంచన అనగానే.. అందరి ముందు క్షమాపణ అడిగి.. నేను ఇచ్చిన జాబ్ చెయ్యాలని శివన్నారాయణ‌ అంటాడు. నేను ఒప్పుకోనని కార్తీక్ అనగానే నేను ఒప్పుకుంటున్నాను కార్తీక్ బాబు తరుపున నేను చెప్తానని దీప అనగానే.. నీ భర్త అసమర్ధతుడు అంటున్నారు.. దానికి నువ్వు ఒప్పుకుంటావా అని కార్తీక్ అనగా.. లేదని దీప అంటుంది. అదీ నా భార్య.. ఇప్పుడు చెప్తున్నా నేను కట్టుబట్టలతో ఇంట్లో నుండి వెళ్లిపోతా ఏం అంటావ్ అమ్మ అని కాంచనని కార్తీక్ అడుగుతాడు. నీ మాటే నా మాట అని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.