English | Telugu

Jayam serial : భానుని చంపింది రుద్ర కాదని పోలీసులకి క్లారిటీ.. మరి ఎవరు?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -59 లో.....సంఘటన రీక్రియేట్ లో నేను ఉంటానని గంగ అంటుంటే రుద్ర వద్దని అంటాడు. నేను అమ్మాయిని నాకు బలం లేదని అనుకుంటున్నారా.. నాకు చాలా బలం ఉంది .. ఇప్పుడు నన్ను వద్దన్నారంటే ఇక్కడ నుండి దుకేస్తానని రుద్రని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ కానీ తనపై రుద్ర కోప్పడతాడు.

ఆ తర్వాత వీరు నువ్వు చెయ్ అని రుద్ర అంటాడు. వీరు బయపడుతుంటే నేనున్నాను.. నీకెందుకు టెన్షన్ అని రుద్ర అంటాడు. భాను ప్లేస్ లో వీరు ఉంటాడు. వీరుని రుద్ర గట్టిగా నెడితే గోడ చివరి వరకు వెళ్లి అక్కడ గోడ దగ్గర ఆగిపోతాడు. రుద్ర గారు అంత గట్టిగా నెట్టినా కూడ వీరు కిందపడలేదు.. గోడ అడ్డు ఉంది.. అయితే భాను గారు కూడ పడే ఛాన్స్ లేదు.. ఎవరో కావాలనే పడేసారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఈ కేసులో రుద్ర గారి తప్పేం లేదని అనుకుంటారు.

ఆ తర్వాత గంగ, రుద్ర, పెద్దసారు ఇంటికి వస్తారు. రుద్రని పెద్దసారు హగ్ చేసుకుంటాడు. మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. నువ్వు ప్రాణంగా చూసుకున్నావ్ వాడిని.. అలాంటిది నువ్వు వాడి ప్రాణం తీసావ్ అంటుంటే చాలా బాధపడ్డానని పెద్దసారు అంటాడు. ఈ విషయం వెంటనే మీ పెద్దమ్మ తో చెప్దామని పెద్దసారు అంటాడు. నేను నెట్టలేదని తెలిసింది కానీ ఎవరు నెట్టారో తెలియదు కదా అని రుద్ర అంటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు నీకు ఇష్టమైన భానుని దూరం చేస్తే మానసికంగా కుంగిపోతావని ఇలా చేసి ఉంటారని పెద్దసారు అనగానే అవును నిజమే అనిపిస్తుందని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.