English | Telugu

కెసిఆర్ మూవీలోని 'యాడి యాడి ' సాంగ్ వినండి అంటున్న జబర్దస్త్ టీమ్...


తెలంగాణ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ‘కేసీఆర్’ పేరుతో "కేశవ చంద్ర రామావత్" అనే మూవీని రూపొందించాడు. ఈ మూవీ నుంచి "యాడి యాడి" అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆటో రామ్ ప్రసాద్ , బులెట్ భాస్కర్ ఇద్దరూ రాకేష్ కి సపోర్ట్ చేస్తూ ఆ సాంగ్ గురించి నాలుగు మాటలు చెప్పారు.

ఈ సాంగ్ డిఫరెంట్ జానర్ లో ఉందని వినేవారందరికీ నచ్చుతుందని చెప్పారు. మ్యూజిక్ చరణ్ అర్జున్, లిరిక్స్ కాసర్ల శ్యాం, పాడింది రామ్ మిరియాల...వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చిన ఎన్నో సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి...అలాగే ఈ సాంగ్ ఎంతో ఫేమస్ అవుతుంది అని చెప్పారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు రాకేష్. ఇందులో రాకేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు తనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ కి సిద్ధమయ్యే సమయంలో ఈ మూవీకి గట్టి దెబ్బ తగిలింది. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడేసరికి మూవీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి, విడుదలను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలా లాస్ట్ ఇయర్ విడుదల కాకుండా నిలిచిపోయింది ఈ సినిమా. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాడు రాకేష్. అందుకే ఒక సాంగ్ ని బయటకు విడుదల చేసాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే మూవీస్ కి సెన్సార్ బోర్డు ఎప్పుడూ నో చెప్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ తీసిన "వ్యూహం" మూవీకి కూడా సెన్సార్ అడ్డుపడింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. సాధారణ కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు రాకింగ్ రాకేష్. అలా ఇప్పుడు మూవీ కూడా తీసే స్థాయికి వచ్చాడు రాకేష్. ఐతే తాను కెసిఆర్ కి పెద్ద ఫ్యాన్ ని అని ఈ మూవీ చేయడం కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టానని గతంలో చెప్పాడు రాకేష్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.