English | Telugu

యాంకర్ శివకి దిమ్మ తిరిగే షాకిచ్చిన ఇనయా!

బిగ్ బాస్ సీజన్-6 లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా హౌస్ నుంచి బయటకొచ్చాక, యాంకర్ శివతో ఎగ్జిట్ ఇంటర్వ్యూ జరిగింది. "ప్రతిసారీ బిగ్ బాస్ విన్నర్ నేనే అంటూ అరిచేదానివి కదా.. ఏమైంది నీ ఓవర్ కాన్ఫిడెన్స్" అని శివ అనగా, "అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. నా మీద నాకున్న నమ్మకం" అని ఇనయా సమాధానమిచ్చింది.

"మొదటి వారమే బయటకొస్తావనుకున్నా.. కానీ సడెన్ గా నీ గ్రాఫ్ పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది" అని శివ అన్నాడు. "ఎక్కడ తగ్గింది?" అని ఇనయా అడిగేసరికి, "సూర్య విషయంలో.‌. లవ్ ట్రాక్ వల్ల తగ్గింది" అని శివ రిప్లై ఇవ్వడంతో.. "నేను లవ్ అని ఎప్పుడైనా చెప్పానా" అని అంది ఇనయా. "హౌస్ లో గట్టి పోటీ ఇచ్చి అనవసరంగా నోరు జారావ్ కదా" అని ప్రశ్నించగా, "నన్ను హౌస్ మేట్స్ రెచ్చగొట్టారు. ఆ ఫ్రస్టేషన్ లో కొన్ని మాటలు జారాను. అందరూ నన్ను కార్నర్ చేసారు. నాకు సపోర్ట్ లేదు. ఎంకరేజ్ లేదు.‌. ఎవరికీ నేను ఇష్టం లేదని అనిపించింది" అని చెప్పింది.

ఆ తర్వాత శివ మాట్లాడుతూ, "హౌస్ లో శ్రీహాన్ తో కొన్ని రోజులు గొడవ పడ్డావ్. మళ్ళీ కలిసిపోయి కాంప్లిమెంట్ ఇచ్చావ్. మళ్ళీ నామినేట్ చేసావ్. నువ్వు నీ మాట మీద ఉండవా" అని అడగగా, "హౌస్ లో శ్రీహాన్ కి నాకు గొడవ ఉంది. కానీ ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ మా మధ్య ఏదో ఉంది అని అనుకోవడం, నాకు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ అతడిని నామినేట్ చేశాను" అంటూ చెప్పుకొచ్చింది ఇనయా. "హౌస్ మేట్స్ గురించి నీ మాటల్లో చెప్పు" అని అడగగా, "కీర్తి భట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఇంకా రేవంత్ కి రెండు ముఖాలు ఉన్నాయి. ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతాడు. శ్రీసత్య చాలా రెచ్చగొడుతుంది. ఆదిరెడ్డి పర్ఫెక్ట్ గేమర్. రోహిత్ జెన్యూన్ పర్సన్. ఇంకా నా హార్ట్ లో మెరీనా అక్కకి సెపరేట్ స్పేస్ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.