English | Telugu

Ilu illalu pillalu : కొత్తజంటకి శోభనం ఏర్పాట్లు.. ప్రేమని కాపాడిన ధీరజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -40 లో.......నర్మద స్నానం చేసి తల తుడ్చుకుంటుంటే అప్పుడే సాగర్ వచ్చి నర్మద వంక రొమాంటిక్ గా చూస్తూ తనని పట్టుకుంటాడు. వదలండి లేదంటే గట్టిగ అరుస్తానని నర్మద అంటుంది. అరువు అని సాగర్ అనగానే నిజంగానే నర్మద గట్టిగా అరుస్తుంది. దాంతో ఏమైందంటూ వేదవతి ఇంకా కామాక్షి వస్తారు. ఏమైందని అనగానే బల్లి పడింది అందుకే అరిచానని నర్మద అంటుంది.

అదంతా గమనించిన కామాక్షి నాకు అంతా అర్థం అయింది కానీ శోభనం జరగకుండా ఇద్దరు ఒకే గదిలో వద్దని సాగర్ తో కామాక్షి చెప్తుంది. అది విన్న వేదవతి అప్పుడే రామరాజు దగ్గరికి వెళ్లి పెళ్లి అయిన జంటకి కొన్ని తంతులు ఉంటాయి. అవి పట్టించుకోకుంటే ఎలా అని వేదవతి అంటుంది. ఏంటని రామరాజు అడుగగా నడిపోడికి శోభనమని వేదవతి చెప్తుంది. వాళ్లకు సంబంధించినవి నువ్వే చూసుకోమన్నాను అలాంటప్పుడు నన్ను అడగడం ఎందుకని రామరాజు చెప్పి వెళ్ళిపోతాడు. ఒప్పుకున్నారు కానీ అలా ఎందుకు ఉన్నారని వేదవతి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ కోసం కళ్యాణ్ వెయిట్ చేస్తుంటాడు. తన కోసం టీ ఆర్డర్ చేసి అందులో మత్తు కలుపుతాడు. అప్పుడే ప్రేమ వచ్చి అది తాగబోతుంటే ధీరజ్ వచ్చి ఆపుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. వీడితో తిరగొద్దని ధీరజ్ అనగానే.. నువ్వు ఎవడివిరా అంటు ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. నువ్వు నా మరదలివి నిన్ను కాపాడే బాధ్యత నాకుందని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ వినదు.

దాంతో ధీరజ్ ప్రేమ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ప్రేమకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇంటికి వెళ్తుంది. అందరు తన గురించి వెయిట్ చేస్తుంటే.. ఇంట్లో అందరికి చెప్పేసి ఉంటాడని ప్రేమ భయపడుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నీకు పెళ్లి చూపులని భద్రవతి అనగానే ప్రేమ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్, నర్మదలకి శోభనం ఏర్పాట్లు చేస్తుంది వేదవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.