English | Telugu

Illu illalu pillalu: అమూల్యకి పెళ్ళి సంబంధం ఫిక్స్ చేయించిన రామరాజు.. కుటుంమంతా హ్యాపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -365 లో... ధీరజ్ కి సంబంధించిన వస్తువులన్నీ ప్రేమ దాచేస్తుంది కానీ ధీరజ్ మాత్రం.. అమ్మ షర్ట్ ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ అంటూ వేదవతిని పిలుస్తాడు. వేదవతిని సైలెంట్ గా ఉండమని నర్మద చెప్తుంది. ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని వేదవతితో నర్మద చెప్తుంది. మేం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నామని వేదవతి చెప్పగానే మీరు టెన్షన్ పడకుండి అత్తయ్య అంతా మంచే జరుగుతుందని నర్మద చెప్తుంది.

మరొకవైపు ధీరజ్ షర్ట్ ప్రేమనే దాచేసింది అని ధీరజ్ కి అర్థమై అతను వేరొక షర్ట్ వేసుకుంటాడు. కార్ తాళం కోసం వాళ్ల ఓనర్ కి ఫోన్ చేస్తాడు. కార్ తాళం ఒక కొండముచ్చు తీసుకుంది ఇంకొక తాళం పంపండి అని ధీరజ్ ఫోన్ చేస్తాడు. దాంతో ధీరజ్ వైపు ప్రేమ కోపంగా చూస్తుంది.

మరొకవైపు రామరాజు, వేదవతి ఇద్దరు కలిసి సంబంధం మాట్లాడటానికి తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్తారు. వాళ్ళు మొదట్లో మీ కుటుంబంలో ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. కొంచెం మీ కుటుంబం నుండి అమ్మాయి అంటే ఆలోచించాలని అంటారు. అబ్బాయి వాళ్ల అమ్మ వనజ కూడా అంటుంది. మీరు అలోచించేది కరెక్టే కానీ నాకు వచ్చిన ఇద్దరు కోడళ్ళు కూడా నాకు గౌరవం తెచ్చిన వాళ్లే అని గొప్పగా చెప్తాడు రామరాజు. దాంతో వాళ్ళు అమూల్యని చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఇక రామరాజు, వేదవతి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఆ తర్వాత రామరాజు వాళ్ళు ఇంటికి వెళ్లి అందరికి విషయం చెప్తారు. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తిరుపతి స్వీట్ తీసుకొని వచ్చి అందరికి తినిపిస్తాడు. శ్రీవల్లి మాత్రం డిజప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత విశ్వకి అమూల్య ఫోన్ చేసి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసారని చెప్తుంది. మరొకవైపు శ్రీవల్లి తన పేరెంట్స్ కి విషయం చెప్పాలని వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.