English | Telugu

Illu illalu pillalu:  భాగ్యం డైరెక్షన్ లో శ్రీవల్లి.. ఆ ఇంటిని గుప్పిట్లో పెట్టుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-136లో.. పెద్దోడి పెళ్ళి అవుతుంది. ప్రేమ ప్లాన్ వల్లే ఇదంతా సాధ్యమని ప్రేమకి థాంక్స్ చెప్తాడు ధీరజ్. ఇక తన మీద అరవలేదని తను కూడా థాంక్స్ చెప్తుంది. ఇక ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే నర్మద అతని భర్త కూడా కలిసి చేస్తాడు. ఇక వీరిని చూసి పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇద్దరు పీటల మీద నుండే డ్యాన్స్ చేస్తుంటారు. అదంతా సరదగా సాగుతుంది. అందరు ఎంజాయ్ చేస్తుంటే రామరాజు మాత్రం ఏదో ఆలోచిస్తుంటాడు.

ఇంతలో రామరాజుకి విశ్వ గుర్తొస్తాడు. నా కొడుకుని కిడ్నాప్ చేస్తావారా అని రగిలిపోతాడు. మరోవైపు భాగ్యం తన మాటలతో చక్రం తిప్పాలనుకుంటుంది. పెళ్లి బట్టల్లో ఉన్న కూతుర్ని పక్కకి తీసుకుని వెళ్లి చెప్తుంటుంది. నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేయడానికి నేను శకుని కంటే ఎక్కువ పాచికలు వేశా.. నా మాయమాటలతో రామరాజునే బురిడీ కొట్టించా.. నేను చక్రం తిప్పడం అయిపోయింది.. ఇక నుంచి నీ ఆట మొదలైంది.. నీకు అమాయకుడైన మొగుడు.. బంగారం లాంటి అత్తమామలు దొరికారు.. నీకు వచ్చిన చిక్కు ఏంటంటే.. నీ తోటి కోడళ్లే అని భాగ్యం అంటుంది. తోడుకోడళ్లతో చిక్కు అంటావ్ ఏంటమ్మా, వాళ్లు నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని శ్రీవల్లి అంటుంది. మంచోళ్లు కావచ్చు కానీ వాళ్లిద్దరూ నీకంటే బాగా చదుకున్నోళ్లు.. నీకంటే తెలివైన వాళ్లు.. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు.. వాళ్లకి తలపొగరు, అహంకారం ఉంటుంది.. అందుకే నీకు ప్రమాదం.. నీకు వాళ్ల నుంచి ప్రమాదం రాకుండా ఉండాలంటే నువ్వు నీ మొగుడ్ని, నీ అత్తమామల్ని గుప్పెట్లో పెట్టేసుకోవాలి.. అప్పుడు నీ తోడుకోడళ్లు చచ్చినట్టు నీ కాలికింద చెప్పులా పడి ఉంటారు. నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోమని కూతురు శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం.

అదంతా విన్న శ్రీవల్లి.. అర్థం అయ్యింది అమ్మా.. వాళ్లు కాస్త గట్టిగా మాట్లాడినా గొడవ పెట్టేసుకోమంటున్నావ్ అంతేనా అని అంటుంది. నీ మొహమే.. అలా గొడవలు పెట్టుకుంటే.. అందరి దృష్టిలో గయ్యాళి అయిపోతావ్ తప్ప.. ఈ ఇంటిని నీ గుప్పెట్లో పెట్టుకోలేవ్. వాళ్ళిద్దరు నీకంటే ముందు ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చినా కూడా ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే.. కాబట్టి.. ప్రతి విషయంలోనూ నీ మాటే చెల్లాలి.. నీ పెత్తనమే సాగాలి.. నీకు నేను ఎప్పటికప్పుడు ఫోన్‌లో డైరెక్షన్ ఇస్తాను.. నేను చెప్పినట్టు చేసి ఆ ఇంటిని గుప్పెట్లో పెట్టేసుకోమని భాగ్యం చెప్తుంది. సరేనమ్మా.. నువ్వు ఎట్టాగంటే అట్టా అని అప్పగింతల కార్యక్రమంలోకి వెళ్లిపోతుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.