English | Telugu

వాళ్ళిద్దరూ కామెడీ పీస్ లు.. మహేంద్ర కామెంట్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1089 లో.... వసుధార స్పృహ నుండి బయటకు వచ్చి.. అసలు ఏం జరిగిందని చెప్తుంది. నాకు ఫోన్ చెయ్యగానే నేను వెళ్లానని చెప్పగానే.. వసుధార ప్రాబ్లమ్ లో ఉందని మెసేజ్ రావడం తో నేను వెళ్ళాను.. లోపలికి వెళ్లేసరికి వసుధర స్పృహలో లేదు.. ఎవరో గడియ పెట్టారని మను చెప్తాడు. అటుగా వెళ్తుంటే.. సౌండ్ వచ్చింది నేనే డోర్ ఓపెన్ చేసాను.. వాళ్ళని బయటకు పంపించి లోపల నేను ఉన్నానని ఏంజిల్ అంటుంది. ఎవరో ఇదంతా కావాలనే చేశారు.. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవాలని ఇలా చేశారు అని ఏంజిల్ అంటుంది.

థాంక్స్ ఏంజిల్ అని వసుధార చెప్తుంది. ఆ సిచువేషన్ లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారని ఏంజిల్ అనగానే అందరు చెయ్యడం వేరే కానీ నువ్వు చేసావని మను అనగానే.. ఫస్ట్ టైమ్ నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడావని ఏంజిల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అయితే రోజు ఇలా హెల్ప్ చేస్తానని ఏంజిల్ అనగానే అలా ఏం వద్దు లే అంటూ మను నవ్వుతాడు. మా బావ నవ్వుతున్నాడని ఏంజిల్ మురిసిపోతుంది. ఆ తర్వాత వసుధారకి కానిస్టేబుల్ ఫోన్ చేసి రాజీవ్ జైల్లో నుండి తప్పించుకున్నాడని చెప్తాడు. దాంతో వసుధార టెన్షన్ పడుతుంది. అపుడే మహేంద్ర వస్తాడు. రాజీవ్ తప్పించుకున్నాడని వసుధార చెప్తుంది. దానికెందకు టెన్షన్.. శైలేంద్రనే చీట్ చేసి రాజీవ్ ని తానే రప్పించేలా చేసాం.. వాళ్ళిద్దరూ కామెడీ పీస్ అని వసుధారతో మహేంద్ర అంటాడు. అదంతా రాజీవ్ చాటుగా విని నన్ను పట్టించింది శైలేంద్ర నా వాడి సంగతి చెప్తానని రాజీవ్ అనుకుంటాడు.

మరొకవైపు రాజీవ్ వచ్చి తనని ఏదో చేస్తాడని శైలేంద్ర భయపడుతుంటే అప్పుడే రాజీవ్ వస్తాడు.. రాజీవ్ ని చూసి శైలేంద్ర భయపడతాడు. నువ్వే నన్ను పట్టించావని తెలుసని గన్ శైలేంద్ర తలపై పెడతాడు. అప్పుడే దేవయాని వచ్చి.. శైలేంద్ర నాకు జరిగింది చెప్పాడు. రాజీవ్ ని మోసం చెయ్యడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చాను. మీరిద్దరు కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చెయ్యగలరు.. మీ వీక్ పాయింట్ తో వాళ్ళు మిమ్మల్ని దెబ్బకొడుతున్నారు అంటూ దేవయాని చెప్తుంది. ఆ తర్వాత ధరణి, దేవయాని, మహేంద్ర ఇంటికి వచ్చి.. ధరణి, శైలేంద్రతో పూజ జరిపిస్తున్నాను.. మీరు రండి అని అనుపమ, వసుధార, మహేంద్రలకి దేవయాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.