English | Telugu

Guppedantha Manasu:అటు స్టూడెంట్స్ ఇటు ఫ్యాకల్టీ చేస్తోన్న ధర్నాలో ఏం జరగనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -973 లో... రిషి కోసం చక్రపాణి ఇంట్లోకి వస్తాడు శైలేంద్ర. ఎందుకొచ్చావని శైలేంద్రని చూసి వసుధార తిడుతుంది. రిషి కోసం శైలేంద్ర వెతుకుతుంటాడు. వసుధార అడ్డుపడిన శైలేంద్ర వినకుండా వెతుకుతుంటాడు. అయిన రిషి ఎక్కడ కన్పించడు. దాంతో శైలేంద్ర కోపంగా తిరిగి వెళ్ళిపోతు.. ఆ రిషిని బ్రతకనివ్వనని వసుధారతో శైలేంద్ర అంటాడు.

మరొకవైపు వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తుంటాడు. శైలేంద్ర ఉన్నంతసేపు లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ చేసి.. వసుధారతో మాట్లాడతాడు. ధరణి కాల్ చేసిన విషయం మహేంద్ర చెప్తాడు. రిషి కోసం ఆ శైలేంద్ర ఇక్కడికి కూడా వచ్చాడని మహేంద్రకి వసుధార చెప్తుంది. కానీ రిషి సర్ ని సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంచానని వసుధార చెప్తుంది. ఎక్కడ ఉన్నాడని మహేంద్ర అడుగగా.. కలిసినప్పుడు చెప్తానని వసుధార చెప్తుంది. రిషిని మాత్రం జాగ్రత్తగా చూసుకోమని మహేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. మరుసటి రోజు ఉదయం రిషిని కాపాడిన ముసలివాళ్ళ దగ్గర రిషి ఉంటాడు. వాళ్ళు వైద్యం చేస్తూ ఉంటే వసుధార, చక్రపాణి ఇద్దరు బయట ఉంటారు. ఇక్కడ అయితే రిషి సర్ సేఫ్ గా ఉంటారు. ఇక్కడికి ఆల్రెడీ శైలేంద్ర వచ్చాడు కదా మళ్ళీ ఇక్కడికి రాడు. ఇక్కడ ఉన్నట్లు అసలు డౌట్ కూడా రాదు కానీ మీ దగ్గర కాకుండా రిషి సర్ ని ఇక్కడ ఉంచినందుకు బాధగా ఉందని వసుధార అంటుంది.

మరొకవైపు శైలేంద్ర ఎండీ చైర్ ని చూస్తూ మురిసిపోతు ఉంటాడు. ఇక తన ప్లాన్ లో భాగంగా శైలేంద్ర ఒక స్టూడెంట్ ని పిలిచి.. నీకు డబ్బులు ఇస్తాను నేను చెప్పింది చెయ్యాలని అంటాడు. రిషి సర్ చనిపోయాడు. అందుకే వసుధార మేడమ్ రావడం లేదు. నువ్వు ఈ విషయం అందరికి చెప్పాలంటూ శైలేంద్ర చెప్తాడు. దాంతో స్టూడెంట్ వెళ్లి అందరికి చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర ఆ విషయం సోషల్ మీడియాలో కూడ పోస్ట్ చేయడంతో.. కాలేజీలో అందరు అది చూసి మహేంద్రని అడగడానికి వస్తారు. ఏమైందంటు మహేంద్ర అడుగుతాడు. మాకు రిషి సర్ కావాలి సర్. ఎక్కడ ఉన్నాడంటు అడుగుతారు. మాకు సిలబస్ కావడం లేదంటూ స్టూడెంట్స్ ఓవైపు.. మాకు జీతాలు రావడం లేదంటూ ఫాకల్టీ మరోవైపు అందరు కలిసి మహేంద్రకి చెప్తారు. వసుధార మేడమ్ ఎందుకు రావడం లేదని స్టూడెంట్స్, ఫాకల్టీ అడుగుతారు. మేడమ్ వస్తుంది అని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.