English | Telugu

బాబు వేసిన లేడీ గెటప్ కి సిగ్గుపడిన కృష్ణ భగవాన్


ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి కలర్ ఫుల్ స్కిట్స్ తో జడ్జెస్ జోక్స్ తో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి ఖుష్భు ప్లేస్ లో అలనాటి క్యూట్ అండ్ బబ్లీగా "నీ కోసం" అంటూ తన అద్భుతమైన నటనతో ఎంతో మంది హృదయాలను దోచేసిన మహేశ్వరీ ఎంట్రీ ఇచ్చారు. ఇక మరో జడ్జి కృష్ణ భగవాన్ కూడా ఈ షోలో కనిపించారు. ఇక ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ స్కిట్ లో కృష్ణ భగవాన్ మీద, రష్మీ మీద పంచెస్ బాగా వేశారు కమెడియన్ బాబు, వర్ష. ఇమ్మానుయేల్, వర్ష, కమెడియన్ బాబు కలిసి రజనీకాంత్ మూవీ "నరసింహ" ని స్పూఫ్ గా చేశారు.

"పుట్టలో పాలు పొయ్యి వర్ష కృష్ణ భగవాన్ లాంటి మొగుడొస్తాడు" అని వర్షకి ఆమె ఫ్రెండ్ సలహా ఇచ్చేసరికి " ఆయన రావాలంటే పాలే పొయ్యాలా లొకేషన్ పెట్టినా వచ్చేస్తారు" అంటూ కృష్ణ భగవాన్ మీద సెటైర్ వేసింది వర్ష..దానికి ఆయన షాకయ్యాడు. ఇక ఇమ్ము ఎంట్రీ ఇచ్చాక లేడీ గెటప్ లో బాబు వచ్చి "నరసింహా రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావ్ వస్తే వచ్చావ్ గాని అర్ధరాత్రి దాటాక రా..ఎందుకంటే మార్నింగ్ కృష్ణ భగవాన్ గారు ఇంటికొస్తారు అందుకే" అనేసరికి ఇమ్ము షాకయ్యాడు. ఇక ఈ స్కిట్ బాగుంది, డ్రామా బాగా పండింది అని మహేశ్వరీ కామెంట్ చేశారు. తర్వాత కృష్ణ భగవాన్ గారు ఎంట్రీ ఇచ్చి తన అభిప్రాయం చెప్పారు. "మహేశ్వరీ గారికి ఫస్ట్ టైం కాబట్టి బాగున్నట్టు అనిపిస్తోంది. ఎవరూ లేడీ గెటప్ వేసినా సిగ్గేయలేదు కానీ బాబు లేడీ గెటప్ వేసేసరికి నాకు సిగ్గేసింది..ఎందుకో తెలీలేదు" అని మస్త్ కామెడీ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించారు.