English | Telugu

Eto Vellipoyindhi Manasu : పారేసుకున్న ఆ డైమండ్ రింగ్ ని సీతాకాంత్ కి దక్కించుకోగలడా?

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో.. రింగ్ ఎక్కడ పోయిందని సీతాకాంత్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన క్యాబ్ లో రామలక్ష్మికి రింగ్ కనిపిస్తుంది. అది పట్టుకొని ఇంట్లో వచ్చి ఈ రింగ్ ఎవరిదని ఆలోచిస్తుంది. ఆ రింగ్ చూసి రామలక్ష్మి వాళ్ళ అమ్మ బంగారo ఉంగరమా అని అడుగుతుంది. లేదు రోల్డ్ గోల్డ్ లాగా ఉందని అని ధన అంటాడు.

ఆ తర్వాత ఆ రింగ్ ఇవ్వు అని పింకీ తీసుకొని.. నెట్ లో సెర్చ్ చేసి చూస్తుంది. ఆ రింగ్ డీటెయిల్స్ చూసి పింకీ షాక్ అవుతుంది. ఏమైంది అంటూ రామలక్ష్మి వాళ్ళు అడుగుతారు. ఇది బంగారo కాదు డైమండ్ రింగ్ అనగానే అందరు షాక్ అవుతారు. దీని కాస్ట్ యాభై లక్షలు అనగానే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత డోర్లు వేసి ఆ రింగ్ ని చూస్తుంటారు. అప్పుడే మాణిక్యం వచ్చి డోర్ కొడుతాడు. నాన్న గానీ ఈ రింగ్ చూస్తే ఇక అంతే సంగతులని ధన అంటాడు. అందరు ఎప్పటిలాగే ఉందామని అనుకుని డోర్ తీస్తారు. ఇప్పుడే తాగి వచ్చిన తిట్లతో స్వాగతం పలికే తన భార్య నవ్వుతు లోపలికి రమ్మనడం చూసి మాణిక్యం షాక్ అవుతాడు. అందరు రోజులాగా కాకుండా డిఫరెంట్ బెహేవ్ చేసేసరికి.. ఏం జరిగిందని మాణిక్యం అడుగుతాడు. ఏం లేదని అనగానే వెళ్లి మాణిక్యం పడుకుంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మాకి రింగ్ ఎక్కడో పడిపోయిందని చెప్తాడు. అది విని శ్రీవల్లి గొడవ చెయ్యాలని ట్రై చేస్తుంది కానీ తన అత్తయ్యకి బయపడి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రింగ్ చూస్తూ రామలక్ష్మి ఫ్యామిలీ ఉంటుంది. రింగ్ ఏమైందని సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటు రామలక్ష్మి క్యాబ్ లో పడేసుకున్నాన అని ఆలోచించుకుని తనకి ఫోన్ చేస్తాడు. ఎక్కడ మాణిక్యం లేస్తాడో అని రామలక్ష్మి సీతాకాంత్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత రింగ్ చేతులో ఉండగానే అందరు పడుకుంటారు. మాణిక్యం నిద్రలేచి రింగ్ తీసుకోగానే అందరు లేస్తారు... ఆ రింగ్ యాభై లక్షలు విలువైనదని తెలుసుకున్న మాణిక్యం అది అమ్మి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. వద్దు నాన్న అది వాళ్ళది.. వాళ్ళకి ఇచ్చేయాలని రామలక్ష్మి అన్న కూడా మాణిక్యం పట్టించుకోడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ వాళ్ళ అమ్మకి రింగ్ దొరికిందని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.