English | Telugu

Eto Vellipoyindhi Manasu : శ్రీలత పెట్టిన పరీక్షల్లో వాళ్ళిద్దరు బయటపడ్డారా.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57 లో.. సీతాకాంత్ , రామలక్ష్మి ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే.. శ్రీలత చూసి శ్రీవల్లిని పిలుస్తుంది. ఆ తర్వాత తనకి హారతి ఇవ్వమని శ్రీలత అనగానే.. అందరు షాక్ అవుతారు. నిన్నటి వరకు పుట్టెడు కోపంగా ఉన్న అత్తయ్య ఇప్పుడేంటి ఇలా మారిపోయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నువ్వు అంటే నాకు కోపం లేదు కానీ మీ నాన్న చేసిన మోసాన్ని మాత్రం క్షమించలేనంటూ రామలక్ష్మితో ప్రేమ గా ఉన్నట్టు నటిస్తుంది శ్రీలత.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు పెళ్లి చేసుకోలేదని డౌట్ వచ్చి.. ఎలాగైనా ఆ విషయం బయటపెట్టాలని శ్రీలత అనుకుని.. రామలక్ష్మి నువ్వు మొదటగా ఇంట్లో దీపం వెలిగించాలని పూజ గదిలోకి తీసుకొని వెళ్తుంది. దీపం వెలిగించకపోతే ఎక్కడ డౌట్ వస్తుందోనని రామలక్ష్మి దీపం వెలిగిస్తుంది. సీతా.. నువ్వు రామలక్ష్మి నుదిటిపై బొట్టు పెట్టమని శ్రీలత చెప్పగానే సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు టెన్షన్ పడతారు. పరాయి మగాడితో నుదిటిపై బొట్టు ఎలా పెటించువాలని రామలక్ష్మి... పరాయి ఆడదాని నుదుటిపై బొట్టు ఎలా పెట్టాలని సీతాకాంత్ టెన్షన్ పడుతారు. ఆ తర్వాత రామలక్ష్మి నుదిటిపై సీతాకాంత్ బొట్టు పెడతాడు. కాసేపటికి ఒకరికొకరు పాయసం తినిపించుకోండి అని శ్రీలత చెప్తుంది. దాంతో ఇబ్బంది పడుతూనే ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు.

ఆ తర్వాత ఇంటికి పెద్ద కోడలు కదా అని లాకర్ కీస్ అంటూ శ్రీలత ఇస్తుంటే.. రామలక్ష్మి వద్దని అంటుంది. ఎప్పుడో వచ్చిన నాకు ఆ బాధ్యతలు అప్పజెప్పలేదు కానీ ఇప్పుడు వచ్చిన తనకి ఇస్తున్నారని శ్రీవల్లి అనగానే.. సందీప్ తన చెంపపై ఒక్కటిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి కీస్ తీసుకుంటుంది. కాసేపటికి శ్రీలత, సందీప్ లు మాట్లాడుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకులేదు.. వాళ్ళు బయటపడాలనే ఇదంతా చేశాను. నుదిటిపై బొట్టు పెడుతుంటే రామలక్ష్మి టెన్షన్ పడింది. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోలేదని శ్రీలత అంటుంది. ఇన్నిరోజులు వాడికి మనం తప్ప ఏ ఆలోచనలు లేకుండా చేశానని సీతాకాంత్ గురించి సందీప్ కి శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.