English | Telugu

Eto Vellipoyindhi Manasu : వాళ్ళ ప్లాన్ సక్సెస్.. అవును వాడు అమ్మ పిచ్చోడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -144 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్లి వస్తుంటారు. అప్పుడే పెద్దాయన చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ఎప్పటికి ఇలాగా హ్యాపీగా ఉండాలి. మీరు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. అపార్థం తర్వాత ఒకటైన బంధం బలంగా ఉంటుందని పెద్దాయన చెప్తాడు. ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలని పెద్దాయన అంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సీతాకాంత్, రామలక్ష్మిలని శ్రీవల్లి చూసి వెంటనే వెళ్లి శ్రీలత, సందీప్ లకి వాళ్ళు వచ్చారని చెప్తుంది.

ఆ తర్వాత ఇక యాక్టింగ్ మొదలు పెట్టమని సందీప్ కి శ్రీవల్లి చెప్తుంది. శ్రీవల్లి కావాలనే గట్టిగా అరుస్తు.. ఏవండీ డోర్ తీయండని అంటుంది. ఆ మాటలు విన్న సీతాకాంత్ వాళ్ళు.. ఏమైంది అంటూ ఫాస్ట్ గా వస్తారు. చాలా సేపటి నుండి డోర్ తియ్యడం లేదని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తుంది. అప్పుడే ఏం తెలియన్నట్టు శ్రీలత వస్తుంది. డోర్ తీయడం లేదని శ్రీవల్లి చెప్తుంది. సీతాకాంత్ పక్కన కిటికీ నుండి చూస్తాడు. లోపల సందీప్ తాడుతో ఉరేసుకొనే ప్రయత్నం చేస్తాడు. అగురా అని సీతాకాంత్ అంటాడు. నేను తప్పు చేశాను బ్రతికే హక్కు లేదని సందీప్ యాక్ట్ చేస్తుంటాడు. సీతాకాంత్ డోర్ పగలగొట్టుకొని వెళ్లి సందీప్ ని ఆపుతాడు. ఏంటి ఈ పిచ్చి పని అని సందీప్ పై అరుస్తాడు. మీ పరువు తీసాను తప్పు చేశానని సందీప్ అంటాడు. తప్పు చేస్తే ఇలా చేస్తారా అని శ్రీలత అంటుంది. నేను బయటకు వెళ్లి ఏం పని చేసుకొని బ్రతికినా.. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అందరికి నేను దొంగతనం చేస్తే ఇంట్లో నుండి గెంటేసారని చెప్పనా అని సందీప్ అంటాడు.

ఏదో కోపంలో అలా అన్నాను కానీ నువ్వు వెళ్తుంటే ఆపేవాడిని. అంతెందుకు మీ వదినే ఆపేదని సీతాకాంత్ అంటాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత సందీప్, శ్రీలత శ్రీవల్లి లు ప్లాన్ సక్సెస్ అంటూ నవ్వుకుంటుంటే అప్పుడు రామలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ సందీప్ గురించి బాధ పడుతంటే.. మీరు ఇంతగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సందీప్ ని సీతాకాంత్ తో మాట్లాడి జనరల్ మేనేజర్ చేయాలని శ్రీలత అనగానే.. ఇన్ని తప్పులు చేసినా ఆయన్ని జనరల్ మేనేజర్ చేయడానికి బావగారు ఏమైనా పిచ్చోడా అని శ్రీవల్లి అనగానే.. అవును అమ్మ పిచ్చోడని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.