English | Telugu

భర్తకి తెలియకుండా భార్య అలా చేసిందా.. ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -136 లో... ధన ఇంటికి డ్రింక్ చేసి వస్తాడు. ఏంటి తాగొచ్చావా అని రామలక్ష్మి అడుగుతుంది. కాళీ గా ఉంటున్న కదా అవమానం భరించలేక తాగుతున్నా.. ఇక రోజు తాగుతా అని ధన అంటాడు. ఒరేయ్ నీతో సీతా సర్ బిజినెస్ పెట్టిస్తాను.. పెట్టుబడి పెడతానని నీకు అంత విలువ ఇస్తుంటే అవమానిస్తున్నాడు అంటున్నవేంటి బుద్ది లేకుండా అని రామలక్ష్మి అంటుంది. అయిన నువు ఇప్పుడు గ్రేట్ బిజినెస్ మ్యాన్ భార్యవి అయిపోయావ్ కదా.. అయినా నీకేం తెలుసు నా బాధ అని ధన అంటాడు. నీ ప్రేమ కోసం ఎంత త్యాగం చేసింది మర్చిపోయావా? ఇంకొకసారి ఇలా మీ అక్క గురించి తప్పుగా మాట్లాడకని ధనకి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఆ తర్వాత అదంతా చూస్తున్న శ్రీవల్లి.. ఆ ధనని తాగేసి వచ్చావని ఆ చెంప ఈ చెంప వాయించకుండా ఇలా అన్నారని అంటుంది. ఇప్పుడు అక్కాతమ్ముల్ల మధ్య గొడవ మొదలయింది దాన్ని ఇంకా పెద్దది చెయ్యాలి. దాంతో సీతాకాంత్, రామలక్ష్మిల మధ్య మనస్పర్థలు వస్తాయ్.. దాంతో రామలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని శ్రీవల్లితో శ్రీలత అంటుంది. మా తమ్ముడు అలా మాట్లాడినందుకు సారీ అని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు సందీప్ రామలక్ష్మి పెట్టిన నగలు దొంగతనం చేస్తాడు. ఎవరు చూడలేదు ఇక మల్లేష్ అప్పు తీర్చాలని సందీప్ అనుకుంటాడు.

ఆ తర్వాత మాణిక్యం, రామలక్ష్మికి ఫోన్ చేసి.. ఇంటి బయట ఉన్నాను రమ్మని చెప్తాడు. రామలక్ష్మి వెళ్లి మాణిక్యంతో మాట్లాడుతుంది. డబ్బులు కావాలి ఒక 500 ఇవ్వమని అంటాడు. దాంతో రామలక్ష్మి ఇస్తుంది. అదంతా పై నుండి శ్రీవల్లి ల, శ్రీలత చూస్తుంటారు. రామలక్ష్మి చాటుగా మాణిక్యంతో మాట్లాడడం.. శ్రీవల్లి వీడియో తీస్తుంది. మరొకవైపు ఎందుకు తాగి వచ్చావంటూ ధనతో సిరి గొడవపడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఇందాక రూమ్ లో లేవ్.. ఎక్కడికి వెళ్ళావని సీతాకాంత్ అడుగుతాడు. నాన్న వచ్చి తాగడానికి డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్తే ఏమంటారోనని.. కిచెన్ లో ఉన్నానని రామలక్ష్మి అబద్దం చెప్తుంది. రామలక్ష్మి బీరువా తాళాలు పెట్టాను కన్పించడం లేదని చూస్తుంది. సీతాకాంత్ కింద పడి ఉన్న తాళాలు ఇస్తాడు. నేను టేబుల్ పై తాళాలు పెట్టాను. ఇక్కడికి ఎలా వచ్చాయని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.