English | Telugu

దివ్య వెన్నుపోటుతో రెండో సారి కెప్టెన్‌గా ఇమ్మాన్యుయల్!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగిసింది. ఇక తొమ్మిదో వారం ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన కెప్టెన్సీ రేస్ లో తనూజ, రీతూ, ఇమ్మాన్యుయల్ మిగిలారు.

తొమ్మిదో వారం మొత్తం ఆరుగు కంటెండర్లు పోటీపడ్డారు. దివ్య, సుమన్ శెట్టి, తనూజ, రీతూ, ఇమ్మానుయేల్, భరణి.. కంటెండర్లుగా రేసులో ఉన్నారు. ఇక వీరికి 'వే టూ కెప్టెన్సీ' అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ట్రైన్ ఇంజిన్‌లోకి కంటెండర్లు కాని వాళ్లు ఎక్కాలి. అందరినీ దాటుకొని ఎవరు అయితే అందులో చోటు దక్కించుకుంటారో వారికి రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ వస్తుంది. భరణి, తనూజ ఇద్దరు ఉండగా భరణిని తీసేస్తాడు రాము. అలా టాస్కులో ముందుగా భరణి తప్పుకుంటాడు. ఆ తర్వాత సాయి ఇంజిన్‌లోకి ఎక్కి దివ్యని రేసు నుంచి ఔట్ చేశాడు. ఆ సమయంలో దివ్య పెద్ద గొడవ చేసింది. ఎందుకంటే ముందు దివ్య కంటే రీతూ పేరు చెప్పాడు సాయి. కానీ రీతూ మళ్లీ బతిమాలడంతో చివరికి దివ్యని సాయి ఔట్ చేశాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ఔట్ అయ్యాడు‌. ఇలా ఒక్కొక్కరు గేమ్ నుండి అవుట్ అవ్వగా తనూజ, రీతూ, ఇమ్మాన్యుయల్ ముగ్గురు మిగులుతారు. ఈ ముగ్గురిలో తనూజ-రీతూ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. ఇమ్మాన్యుయల్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అక్కడ డెసిషన్ మేకింగ్ దివ్య చేతిలోకి వెళ్లింది. దీంతో దివ్య తనూజని రేసు నుంచి తప్పించింది. చాలా వారాలుగా కెప్టెన్ అయ్యేందుకు తనూజ ట్రై చేస్తుంది. అయితే కొన్నిసార్లు చివరి అడుగులో మిస్ అయింది. ఈసారి కూడా ఒక్క అడుగు దూరంలో తనూజని ఆపేసింది దివ్య.

ఇక రీతూ, ఇమ్మాన్యుయల్ ఇద్దరు కెప్టెన్సీ రేసులో నిలవగా వారికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఇమ్మాన్యుయల్ చకచకా రీతూ కంటే ముందు టాస్క్ ని ముగించి గెలిచాడు. ఇక తొమ్మిదో వారం హౌస్ కెప్టెన్ గా ఇమ్మాన్యుయల్ నిలిచాడు. ఇక దివ్య చేతుల మీదుగా ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ బ్యాండ్ ని పొందాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.