English | Telugu

విడాకులు తీసుకున్న చెల్లెలి కాపురం సీరియల్‌ హీరోయిన్‌ శిరీష

బుల్లితెర మీద కావొచ్చు, సిల్వర్ స్క్రీన్ మీద కావొచ్చు ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక బుల్లితెర నటుడు పవన్ అలాగే రీసెంట్ గా ఒక ప్లే బ్యాక్ సింగర్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు బుల్లితెర నటి శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించింది. శిరీష అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. చెల్లెలి కాపురం సీరియల్‌ హీరోయిన్‌ భూమి అంటే ఎవరికైనా గుర్తొచ్చేస్తుంది. ఆ సీరియల్‌ ద్వారా ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది శిరీషా. 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. మొగలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. ఆ తర్వాత వరుసగా సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. "నా పర్సనల్ అప్ డేట్ ని ఫాన్స్ తో, మంచి కోరుకునే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను.. నవీన్ - నేను, ఒకప్పుడు భార్యాభర్తలం.

కానీ ఇప్పుడు పరిస్థితులు మా చేతుల్లో లేవు అందుకే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైపోయారు. ఈ సమయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా నిర్ణయాన్ని మీరంతా గౌరవించాలి. మీరంతా సహృదయంతో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి ఎవరూ విమర్శలు చేయొద్దు. నాకు నవీన్ పట్ల గౌరవం తప్ప మరేమీ లేదు. నేను సెలబ్రిటీగా ఉన్నాను కాబట్టి మీ అందరికీ ఈ విషయం గురించి చెప్పాలని అనిపించింది. " అంటూ శిరీష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సిరిసిల్లకి చెందిన శిరీష తెలుగులో ఎన్నో సీరియల్స్‌లో నటించింది. స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, నాతిచరామి, కాంచన గంగ, చెల్లెలి కాపురం, ఇలా ఎన్నో సీరియల్స్ లో హీరోయిన్‌గా నటించింది. శిరీషకు ఇద్దరు అక్కలు రజిత, సౌజన్య .. వీళ్ళు కూడా సీరియల్ యాక్టర్స్‌ కావడం విశేషం. కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ చారుశీల పాత్రలో సౌజన్య నటించింది.ఈ దంపతులకు శ్రీఈష్ అనే బాబు కూడా ఉన్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.