English | Telugu

డైరెక్టర్ కాబోతున్న బుల్లెట్ భాస్కర్!

శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్స్ మాత్రం కాదు అప్పుడప్పుడు కొన్ని సీక్రెట్స్ కూడా బయట పడుతూ ఉంటాయి. ఈ వారం షో మంచి రసవత్తరంగా సాగింది. సమ్మర్ లో వాటర్ ట్యాంక్ దగ్గర గొడవలు..వాటర్ ట్యాంక్ టైంకి రాకపోతే లేడీస్ ఎలా విసుక్కుంటారో స్కిట్స్ చేసి చూపించారు. ఇక ఈ షోకి "నరకాసుర" మూవీ టీం ప్రొమోషన్స్ లో భాగంగా రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, అపర్ణ జనార్దన్ వచ్చారు. "నరకాసుర అంటున్నారు..మరి ఇద్దరమ్మాయిలను తీసుకొచ్చారేమిటి" అని హీరోని ఆది అడిగేసరికి "ఒక అమ్మాయి నా మరదలు నన్ను ఇష్టపడింది..ఇంకో అమ్మాయి నా మేనేజర్ నేను ఇష్టపడ్డాను" అని రక్షిత్ చెప్పేసరికి "ఓహ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీనా" అంది. "పలాస చూసారు మీరంతా అందులో రక్షిత్ హీరో కదా అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు...ఈ సినిమా కూడా అంతే బిగ్ హిట్ అవుతుంది..ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటో తెలుసా..రక్షిత్ హీరోగా..బులెట్ భాస్కర్ డైరెక్టర్ గా నెక్స్ట్ ఇంకో మూవీ రాబోతోంది." అని చెప్పేసరికి అందరూ వావ్ అన్నారు.

ఇక ఈ మూవీ గురించి హీరోయిన్స్ మాట్లాడుతూ "ఇందులో యాక్షన్, డ్రామా, ఫామిలీ ప్యాకేజ్ ఇది" అని చెప్పారు. "ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని..మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా" అని విష్ చేశారు ఇంద్రజ. బుల్లితెర మీద నుంచి ఎంతో మంది కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెటిల్ అవుతున్నారు. అలాంటి ఒక కమెడియన్ సుధీర్ హీరో అయ్యాడు, లేడీ కమెడియన్ రోహిణి సేవ్ ది టైగర్స్ లో కామెడీ రోల్ చేసి మంచి మార్క్స్ కొట్టేసింది. వేణు బలగం మూవీని డైరెక్ట్ చేసి మంచి కలెక్షన్స్ అందుకున్నాడు. ఇప్పుడు బులెట్ భాస్కర్ వంతొచ్చినట్టు ఉంది. మరి ఏ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు...స్టోరీ ఏమిటి అనే వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.