English | Telugu

బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న బ్రహ్మముడి కావ్య.. క్లూ ఇచ్చేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ కి ఉండే క్రేజే వేరు. అందులో కావ్య పాత్ర అందరికి సుపరిచితమే. అయితే కావ్య అసలు పేరు దీపిక రంగరాజు. తను బ్రహ్మముడి సీరియల్ లో తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నటిస్తుంది.

తాజాగా కావ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మై డియర్ ఫ్రెండ్స్.. బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది.. హింట్ ఆల్‌రెడీ ఇచ్చాను.. గెస్ చేయండి చూద్దామంటూ కావ్య పోస్ట్ పెట్టింది. అయితే ఇది ఏమై ఉంటుందా అని కావ్య ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే కావ్య పెట్టిన పోస్ట్‌లో 'బిగ్' అనే పదాన్ని హైలెట్ చేసింది. అలానే ఆ క్యాప్షన్ చివరిలో కన్ను సింబల్ పెట్టింది. దీంతో తను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నానంటూ చెప్పకనే చెప్పిందన్నమాట.

నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమతి హౌస్‌లోకి వచ్చి టాప్-5కి టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ రోజు ఎపిసోడ్‌లోనే బ్రహ్మముడి కావ్య.. అదేనండి దీపిక రంగరాజు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. సెలబ్రెటీ ఎంట్రీలో భాగంగా దీపిక హౌస్‌లోకి వచ్చి ఫైనలిస్టులతో ఓ ఆట ఆడబోతుంది. మాములుగానే దీపిక యమ ఫాస్ట్. ఇలా బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ అంటే ఏ రేంజ్ లో ఆడుతుందో ఊహకి కూడా అందదు. స్టార్ మా పరివార్ షోలో దీపిక పంచులు ఇప్పటికి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ బ్రహ్మముడి కావ్య ఏ రేంజ్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందో చూడాలి మరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.