English | Telugu

టాప్ రేటింగ్ తో బ్రహ్మముడి.. సెకెండ్ పొజిషన్ లో ఏం ఉందంటే!

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ కి ఉండే క్రేజే వేరు. స్టార్ మా టీవీలో ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్స్ కి ఉండే టీఆర్పీ మరే ఇతర సీరియల్ కి ఉండదు. ఇక ఈ వారం ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో ఓసారి చూసేద్దాం.

కొత్తగా మొదలైన సీరియల్స్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ దూసుకెళ్తుండగా.. పాత సీరియల్ నుండి నవ వసంతంగా వచ్చిన కార్తీకదీపం-2 ఎక్కువగా టీఆర్పీ తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే దీపకి ఆల్రెడీ నరసింహాతో పెళ్ళి జరిగి శౌర్య అనే పాప కూడా ఉండటం.. కార్తిక్ కి జ్యోత్స్న అనే మరదలు ఉండటంతో.. డాక్టర్ బాబు, వంటలక్కల బాండింగ్ లేదా అనే డైలమాలో ఉన్నారు. దీనికి తోడు పారిజాతం చిన్నతనం చేస్తున్న కుట్రలు ఎవరికీ తెలియకపోవడం కథని బలహీనపరిచాయి. దాంతో‌ తెలుగింటి మహిళలు ఈ సీరియల్ ని ఎక్కువగా చూడట్లేదు. అందుకేనేమో కొత్తగా వచ్చిన సీరియల్ ఇంటింటి రామాయణానికి టీఆర్పీ బాగుంటుంది.

బ్రహ్మముడి సీరియల్ కి అత్యధిక టీఆర్పీ 12.51 తో మొట్టమొదటి స్థానంలో ఉండగా.. కార్తీకదీపం-2 రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు, నాల్గవ స్థానంలో ఇంటింటి రామాయాణం ఉండగా కొత్తగా మొదలైన చిన్ని సీరియల్ అయిదవ స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రారంభమై నెల కూడా కాకముందే ఇది టాప్-5 లో చోటు దక్కించుకుంది. ఇక టాప్- 10 లో గుప్పెడంత మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు చోటు దక్కించుకున్నాయి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.