English | Telugu

Brahmamudi : రాజ్ ప్లాన్ ఫెయిల్.. కావ్య ఏం చేయనుంది!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -850 లో.....స్వప్న ఫోన్ కి కనకం ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందని కనకం అడుగుతుంది. నీ కూతురు తప్పు చేసి అక్కడకి వచ్చింది.. ఏం చెప్పలేదా అని రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి ఫోన్ లాక్కొని వేరొకరి ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదని జ్ఞానం కూడా లేదా అని రుద్రాణిని స్వప్న తిడుతుంది.

మరొకవైపు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎలా కనుక్కోవాలని కనకం ఆలోచిస్తుంటే.. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ ఎంట్రీ ఇస్తారు. అసలు ఏం జరిగిందని వాళ్ళని కనకం అడుగుతుంది. నీకేం చెప్పలేదా అయితే మాకు తెలియదని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. ఇద్దరు కావ్య దగ్గరికి వెళ్లి ఐడియా చాలా బాగుంది.. నువ్వు రాసిన లెటర్ చూసి నేను షాక్ అయ్యాను.. ఇదంతా యాక్టింగ్ అని నాకు తెలుసని అపర్ణ అంటుంది. ఇది యాక్టింగ్ కాదు నిజంగానే ఇంట్లో నుండి వచ్చేసానని కావ్య అంటుంది. అసలు ఏం జరిగిందని కనకం అనగానే.. నా కొడుకు దాన్ని అబార్షన్ చేసుకొమ్మంటున్నాడని అపర్ణ చెప్పగానే కనకం షాక్ అవుతుంది. అలా ఎలా చేయించుకుంటుందని కనకం బాధపడుతుంది. సరే గాని ఆకలిగా ఉందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు కావ్యని ఎలా రప్పించాలని ప్లాన్ చేస్తాడు రాజ్. కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. ఇక్కడ మా మమ్మీ బాలేదు.. నానమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్తాడు. రాజ్ తో కావ్య మాట్లాడుతూ మరొక వైపు అపర్ణ, ఇందిరాదేవికి భోజనం వడ్డీస్తుంది. ఒకసారి వీడియో కాల్ చేయండి అమ్మమ్మ ని చూడాలని కావ్య అంటుంది. రాజ్ కి కావ్య వీడియో కాల్ చేసి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరికి చూపిస్తుంది. నాది నాకే రివర్స్ అయింది కదా ఏదో ఫ్రాంక్ చేసానని రాజ్ కవర్ చేస్తాడు.

మరొకవైపు కావ్య ఈ ఇంటిపరువు తీసేల చేస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మించాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు. మరొకవైపు కావ్య జరుగుతున్న దాని గురించి బాధపడుతుంటే.. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి కావ్యతో మాట్లాడుతాడు. తరువాయి భాగం లో మీడియా వాళ్ళు కావ్య దగ్గరికి వచ్చి మీ భర్త మీ కడుపులో బిడ్డ ని వద్దనుకుంటున్నాడంట ఎందుకని అడుగుతారు. అదంతా దుగ్గిరాల కుటుంబం టీవీలో చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.