English | Telugu
Brahmamudi : ఇంకా తగ్గని యామిని ప్రతీకారం.. కావ్య కడుపులో ప్రాబ్లమ్!
Updated : Sep 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -816 లో..... కావ్య కోసం రాజ్ కాఫీ తీసుకొని వస్తాడు. కావ్య అది తాగుతుంటే అసలు నీకు కొంచెం కూడా రొమాంటిక్ ఫీల్ లేకుండా.. కుడిది లాగా తాగుతున్నావని రాజ్ అంటాడు. ఆ యామిని పెట్టిన ఇబ్బంది మీరు నాకు ఎక్కడ దూరం అవుతారోనని భయపడ్డాను కానీ మీరు మాములుగా అయ్యారని రాజ్ తో కావ్య అంటుంది.
అసలు నేను ఆ యామిని దగ్గరికి ఎలా వెళ్ళానని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య జరిగింది మొత్తం చెప్తుంది వెంటనే రాజ్ కోపంగా అక్కడ నుండి యామిని దగ్గరికి బయల్దేర్తాడు. ఏం చేస్తాడోనని కావ్య కూడా వెనకాలే వెళ్తుంది. యామిని దగ్గరికి రాజ్ వెళ్ళగానే రాజ్ కాళ్లపై పడుతుంది యామిని. నన్ను క్షమించమని యామిని అంటుంది. నిన్ను కావ్యని విడదీసి నా సొంతం చేసుకోవాలనుకున్నానని యామిని అంటుంది. నువ్వు నా కాళ్ళపై పడ్డావ్ కాబట్టి క్షమించి వదిలేస్తున్నానని యామినిని వదిలేస్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య, రాజ్ అక్కడ నుండి బయల్దేరతారు. ఇకనైనా రాజ్ ని మర్చిపోమని వైదేహి అనగానే నాకు దక్కని సంతోషం వాళ్లకి దక్కడానికి వీల్లేదని యామిని అంటుంది. ఆ తర్వాత ఆ యామినిని ఏదైనా చేస్తారేమోనని భయపడ్డానని కావ్య అనగానే నేను నీ కోసం తనని వదిలేసాను.. ఇన్ని రోజులు నీకు దూరం అయిన ప్రేమ నీ దగ్గరండి అందిస్తానని రాజ్ అనగానే కావ్య మురిసిపోతుంది.
ఆ తర్వాత ఇంట్లో అందరు వినాయకుడి పూజ చెయ్యాలనుకుంటారు. అప్పుడే రాజ్, కావ్య వచ్చి మంచి ఆలోచన అని అంటారు. తరువాయి భాగం లో రేవతి గురించి రాజ్ కి చెప్తుంది కావ్య. వెంటనే అక్క దగ్గరికి వెళదామని రాజ్ అంటాడు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్తారు. నీ రిపోర్ట్స్ ఒకే కానీ మీ అక్క దాంట్లో ప్రాబ్లమ్ ఉంది తను తొమ్మిది నెలలు బేబీని మోస్తే తన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ చెప్తుంది. దాంతో కళ్యాణ్, అప్పు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.