English | Telugu

Brahmamudi : మా ఆయనకి నాకు తెలియని గతం ఉందా.. షాక్ లో కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -676 లో... యామిని చెప్పినట్లే రాజ్ తో డాక్టర్ చెప్తాడు. నువ్వు గతం మర్చిపోయావ్.. గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, నీ ప్రాణానికే ప్రమాదమని రాజ్ తో డాక్టర్ చెప్తాడు. అదంతా దూరం నుండి కావ్య వింటుంది. అంటే ఇప్పుడు మా ఆయనకి గతం గుర్తులేదా.. ఇప్పుడు నేనెదురు పడినా గుర్తుపట్టడా.. నేను గతం గుర్తు చేసే ప్రయత్నం చేసిన ప్రమాదమా అని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత యామిని రాజ్ ని బయటకు తీసుకొని వస్తుంది. బావ నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యను కానీ గతాన్ని అంతటా నీకే గుర్తు వచ్చే చోటుకి తీసుకొని వెళ్తానని రాజ్ తో యామిని అంటుంటే.. కావ్య వింటుంది. మా ఆయనకి నాకు తెలియని గతం ఉందా.. అదేంటో తెలుసుకోవాలని కావ్య వాళ్ళని ఫాలో చేస్తుంది.

మరొక వైపు అపర్ణకి జ్యూస్ తీసుకొని వస్తుంది ఇందిరాదేవి. నిద్రపోతున్న అపర్ణని ఇందిరాదేవి లేపుతుంది. ఎంత పిలిచిన అపర్ణ లేవకపోవడంతో కంగారు గా సుభాష్ ని పిలుస్తుంది. సుభాష్ వచ్చి చాలాసార్లు పిలవగా అపర్ణ లేస్తుంది. రాజ్ ని గుర్తు చేసుకొని అపర్ణ ఏడుస్తుంది. ఆ పిచ్చి కావ్య వల్లే వదిన ఇలా తయారు అవుతుందని రుద్రాణి అంటుంటే అందరూ రుద్రాణిపై విరుచుకుపడతారు.

ఆ తర్వాత యామిని రాజ్ ని ఒక స్కూల్ కి తీసుకొని వెళ్తుంది కానీ కావ్య వెళ్తుంటే సెక్యూరిటీ తనని ఆపుతాడు. కావ్య సెక్యూరిటికి ఏదో ఒకటి చెప్పి లోపలికి వెళ్తుంది. అక్కడ స్కూల్లో మేడమ్ యామినికి ఫేవర్ గా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి నీ మరదలకి నువ్వు అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేదంటూ మేడమ్ మాట్లాడుతుంటే అదంతా కావ్య వింటుంది.

తరువాయి భాగంలో కావ్య కోసం డాక్టర్స్ ని పిలిపిస్తుంది రుద్రాణి. ఎందుకిలా చేస్తున్నావని రుద్రాణిని సుభాష్ తిడతాడు. నెల రోజుల్లో మా ఆయనని తీసుకొని వస్తానంటూ ఇంట్లో వాళ్లకు కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.