English | Telugu

Brahmamudi : నాకు బుజ్జిలాంటి అమ్మాయి కావాలి.. నువ్వు ఆగవే పొట్టిజుట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో.. రాజ్, కావ్య, భాస్కర్ కలిసి కనకం-కృష్ణమూర్తిల ఇంటికి వెళ్తారు. ఇక ఓవర్ యాక్షన్ కి కేరాఫ్ కనకం తన నటన మొదలెడుతుంది‌. భాస్కర్ కి కనకం ఎక్కువ విలువ ఇస్తూ చేస్తే.. ఆ యాక్టింగ్ ని రాజ్ తట్టుకోలేకపోతాడు. మీరు మా ఇంట్లోకి వచ్చి టీ అయిన తాగి వెళ్ళండని రాజ్ తో కనకం అనగానే.. అమ్మ తను కూడా మాతో పాటు ఇక్కడ ఉండడానికి వచ్చాడని కనకంతో కావ్య అంటుంది. అలా కావ్య అనగానే.. అవును ఇది మా అదృష్టమంటు కనకం అంటుంది. మీరు వచ్చారంటే నాకు ఇంక నమ్మాలనిపించడం లేదని అప్పు అంటుంది.

మరొకవైపు ప్రకాష్ ఏదో మర్చిపోవడం వల్ల యాబై లక్షలు లాస్ వచ్చిందని తనపై సుభాష్ కోప్పడతాడు.. నీకు ఒక్క రోజు కూడా ఆఫీస్ ని నమ్మలేకపోతున్నానని సుభాష్ అనగానే.. ఆపండి బావగారు అంటు ధాన్యలక్ష్మి మధగయలో కలుగజేసుకుని.. అయన ఏం చేసారని ఒక పనివాన్ని తిట్టినట్టు తిడుతున్నారని అనగానే.. సారీ అమ్మ అంటూ సుభాష్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నీకు సంతృప్తిగా ఉందా.. అన్నతమ్ములు ఏమైనా అనుకుంటారు.. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడతావని ధాన్యలక్ష్మిపై అపర్ణ కోప్పడుతుంది. అసలు నీకు బుద్ది ఉందా అంటూ ధాన్యలక్ష్మిని ప్రకాష్ గదిలోకి లాక్కొని వెళ్తాడు. నువ్వు ఏం మాటాడుతున్నావ్.. ఇన్నిరోజలు నాకు మతి మరుపు ఉన్నాసరే అన్ని తనే చూస్తు వస్తున్నాడు.. కోపంలో ఏదో అన్నాడు కదా.. అన్నయ్యని అలా అంటావా.. నువ్వు ఎవరి మాటలు పట్టుకొని ఇదంతా చేస్తున్నావో అర్థం అవట్లేదు కానీ నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావని ధాన్యలక్ష్మిని ప్రకాష్ తిడతాడు.

మరొకవైపు కావ్య అరిటాకులో భాస్కర్ కి భోజనం వడ్డిస్తుంది. అది చూసి రాజ్ తనకే అనుకొని మొహమాటం లేకుండా తినాలని అనుకుంటాడు. అప్పుడే కనకం కూర్చోండి అల్లుడు అంటూ భాస్కర్ కి చెప్తుంది. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ఇలా వడ్డీస్తే చిరాకు పడ్డారు. అందుకే మీకు అలా కాకుండా డైట్ లో ఉన్నారని వెజిటెబుల్స్ తీసుకొని వచ్చి రాజ్ కి అప్పు ఇస్తుంది. ఇక బుజ్జి బుజ్జి అంటూ భాస్కర్ అక్కడ చేసిన వంటలు తింటుంటే రాజ్ చూడలేకపోతాడు. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని భాస్కర్ తో రాజ్ అంటాడు. ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతాడు రాజ్. నాకు బుజ్జిలా ఉండాలని భాస్కర్ అనగానే.. ఆ అదృష్టం లేదు బావ.. మా అక్కకి పెళ్లి అయింది కదా.. ఒకవేళ మా బావ వేరేవాళ్ళని చేసుకుంటే నీకు ఆ ఛాన్స్ వస్తుందని అప్పు అనగానే.. నువ్వు ఆగవే పొట్టి జుట్టుదాన అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ డైవర్ట్ చేయడానికి.. డిజైన్స్ గురించి కావ్య ని అడుగుతాడు. ఆ తర్వాత ఎమోషనల్ అవుతున్న సుభాష్ దగ్గరికి ప్రకాష్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.