English | Telugu

Bigg Boss 9: సంజన కోసం ఎవరెవరు త్యాగం చేశారంటే..?

బిగ్ బాస్ సీజన్-9 లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మిడ్ వీక్ ఎలిమినేట్ సంజన అయిందని అనగానే అందరు షాక్ అయ్యారు. రీ ఎంట్రీ ఉంటుందని తెలిసి కూడా ఏదో మూల ఎలిమినేట్ అవుతుందేమోనన్న భయం లేకపోలేదు.

అయినా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి హౌస్ మేట్స్ కొంతమందిని కొన్నిటిని త్యాగం చేయమన్నప్పుడు.. చేశారు. తనూజ కాఫీ త్యాగం చేసింది. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేసాడు. ఇక భరణి అయితే ఒక్క నిమిషం ఆలోచించకుండా తన సెంటిమెంట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాడు. సంజనని ఎలిమినేట్ చెయ్యడానికి డిసైడ్ అయినప్పుడు తన వంతు తన పాయింట్స్ చెప్పి తను బయటకు వెళ్ళడానికి ఒక రీజన్ అయ్యాడు. సంజన స్టేజ్ పై ఉన్నప్పుడు భరణి లేచి.. మిస్ యూ సంజన అంటాడు. మీరే బయటకు పంపారు కదా అని నాగార్జున సంజన అనగానే భరణి సైలెంట్ అవుతాడు. అది రీగ్రేట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ సంజన లోపలికి రావడానికి భరణి కారణం అయ్యాడు.

రీతూ ఎప్పుడు అందంగా ఉండాలంటూ నీట్ గా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడాలని, స్క్రీన్ స్పేస్ రావాలని పరితపిస్తుంది. ఇక సంజన కోసం తన జుట్టు త్యాగం చేస్తుంది. ఒకవైపు ఏడుస్తునే త్యాగం చేసింది. సంజన లోపలికి వచ్చాక ఏదైనా ఒక వీక్ కాకపోతే ఇంకొక వీక్ సంపాదించుకుంటాం కానీ జుట్టు ఆరు నెలలు టైమ్ పడుతుంది థాంక్స్ అని రీతూ ని హగ్ చేసుకుంటుంది. ఇక సంజన కోసం సుమన్ స్మోక్ చేయకుండా ఉండలేనని ఖచ్చితంగా చెప్పేసాడు. అది తన ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ మెంట్ లాగే ఉంటుంది. సంజన కోసం త్యాగం చేసిన వాళ్ళందరూ తనతో వచ్చిన సెలబ్రిటీస్ మాత్రమే హెల్ప్ చేశారు. ఇకమీద సంజన ఎవరితో ఎలా ఉంటుందో చూడాలి మరి‌.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.