English | Telugu

Bigg Boss 9 Telugu: బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రేయ.. ఓట్ అప్పీల్ కి అవకాశం!

బిగ్ బాస్ సీజన్-9 లోకి పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ ని పంపించడానికి అగ్నిపరీక్ష వేదిక అయింది. ఈ అగ్నిపరీక్షలో పదిహేను మంది కంటెస్టెంట్స్ రాగా వారిలో నుండి అయిదుగురు మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం అగ్నిపరీక్ష టాస్క్ లలో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ బట్టి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళని హౌస్ లోకి పంపించే బాధ్యతలు మాత్రం ప్రేక్షకులదే అని బిగ్ బాస్ ఫైనల్ చేశారు. అయితే ఇప్పటికే హాట్ స్టార్ లో ఓటింగ్ నడుస్తుంది.

నేటి ఎపిసోడ్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అయింది. ఇందులో అంచనా థీమ్ ని జడ్జెస్ తీసుకున్నారు. ఎంత బరువు ఉంటుందని అంచనా వెయ్యడం.. అలా జడ్జెస్ చెప్పిన దానికి దగ్గరగా బరువు కరెక్ట్ గెస్ చేసిన వారు లీడర్.. ఈ టాస్క్ లో అయిదుగురు లీడర్స్ అయ్యారు. టీమ్ కి ముగ్గురు.. ఇక లాస్ట్ టాస్క్ బ్లాక్ బెలూన్ కింద పడకుండా రాడ్ ని తీస్తూ ఉండాలి. ఇలా లెవెల్స్ ఉంటాయి. చివరి వరకు శ్రేయ టీమ్ ఇందులో ఉంటుంది. శ్రేయకి టీమ్ బెస్ట్ పర్పామెన్స్ ఇవ్వగా వారికి ఓటు అప్పీల్ ఛాన్స్ వచ్చింది. శ్రేయ ఓట్ అప్పీల్ ఛాన్స్ ని దాలియాకి ఇచ్చింది.

వరెస్ట్ పర్ఫామెన్స్ గా శ్వేతకి నవదీప్ ఎల్లో కార్డు ఇచ్చాడు. తను బ్లాక్ బెలూన్ పడేయ్యంతో వారి టీమ్ లో మిగతా ఇద్దరికి ఆడే ఛాన్స్ మిస్ అయిందని కారణం చెప్పి ఎల్లో కార్డు ఇచ్చాడు నవదీప్. ఇక బెస్ట్ పర్ఫామెన్స్ గా శ్రేయకి స్టార్ వచ్చింది. దాంతో తను ఇది మా అమ్మకి అంకితం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది. నేను ఒక్కసారి కూడా లీడర్ కాలేదు.. నేను చిన్నపిల్లని అని తొక్కేస్తున్నారని శ్రేయ లీడర్ అయినప్పుడు చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. శ్రేయ గెలవడంతో తనని శ్రీముఖి, బిందుమాధవి ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.