English | Telugu

టికెట్ టు ఫినాలే గెలిచిందెవరో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్-7లో ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తయిన విషయం తెలిసిందే.‌ ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలుంది. పదమూడవ వారం నామినేషన్స్ లో చాలా హీటెడ్ ఆర్గుమెంట్ లు జరిగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని హౌస్‌మెట్స్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్.

ప్రతి సీజన్‌లో ఉండే 'టికెట్ టు ఫినాలే' పేరును కాస్తా మార్చి 'ఫినాలే అస్త్ర' అని పెట్టాడు. ఇక ఇది గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి క్లాక్ వీల్ ఛాలెంజ్ పెట్టాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాలెంజ్‌లో విన్ అయి ఈ అస్త్రాన్ని గెలిచేదెవరో‌ తెలియాలంటే టాస్క్ లు గెలిచి ఎక్కువ పాయింట్లు సాధించాలి. మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్.. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అంతా ఒక క్లాక్ వాచ్ మీద నిలబడి ఉంటారు. క్లాక్ లోని ముల్లు తిరుగుతూ ఉంటుంది. మొదటి బజర్ లో ఎవరు కిందబడతారో వాళ్ళు అవుట్, రెండవ బజర్ లో ఎవరికి తాకుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పగా.. మొదట ప్రశాంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి, గౌతమ్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత యావర్, శివాజీ, అమర్ దీప్, అవుట్ అవ్వగా.. ప్రియాంక, అంబటి అర్జున్ చివరగా ఉన్నారు. ఇందులో ప్రియాంక అవుట్ అయి అంబటి అర్జున్ ఉన్నాడు. మొదటి టాస్క్ లో అర్జున్ గెలిచి వంద పాయింట్లు సొంతం చేసుకున్నాడు. లీస్ట్ లో ఉన్నవారికి ముప్పై పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్.

ఇక రెండవ టాస్క్.. పూలనే సేకరించాలంటే. యాక్టివిటి ఏరియాలో ఉన్న పూలని తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న తమ తమ ఏరియాలో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ప్రశాంత్ అత్యధిక పూలని తీసుకొచ్చి గెలిచాడు‌. అయితే లీస్ట్ లో శివాజీ, శోభాశెట్టి ఉన్నారు. దీంతో లీస్ట్ లో ఉన్నవారి పూలని మిగిలిన వారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక శివాజీ దగ్గరికి అమర్ దీప్ వచ్చి.. నాకు ఫినాలేలో సపోర్ట్ చేస్తానని మాటిచ్చావ్ అనగా, నీకు శోభాశెట్టి ఇస్తుందని శివాజీ అన్నాడు. వీరి మాటలు విన్న బిగ్ బాస్.. ఇద్దరు ఒకే హౌస్ మేట్కి తమ పూలని ఇవ్వాలని అన్నాడు. దాంతో ఇద్దరు కలిసి అమర్ దీప్ కి ఇచ్చారు. ఇలా అమర్ దీప్ కి అత్యధిక పాయింట్లు వచ్చాయి. ఇక మూడవ టాస్క్.. "గాలం వేయి బుట్టలో పడవేయ్" . ఇందులో గాలంతో మధ్యలో ఉన్న బాల్ ని తీసుకొని మీ దగ్గర ఉన్న బాస్కెట్ లో వేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో అర్జున్ మొదట గెలిచి వంద పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ గెలిచి తొంభై పాయింట్లు సొంతం చేసుకున్నాడు. లీస్ట్ లో ఉన్న అమర్ దీప్, ప్రియాంకల మధ్య తోపులాట జరిగింది. ఈ టాస్క్ లో.. అమర్ దీప్ గెలిచి, ప్రియంక అవుట్ అయింది‌.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.