English | Telugu

 జూన్ 3 న డల్లాస్ లో కలుద్దాం...మజా చేద్దాం...వచ్చేయండి అంటున్న అష్షు


అష్షు రెడ్డి టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల తార. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అందరికి తెలిసిందే..ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయ్యింది. నెట్టింట్లో అష్షు హడావిడి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య అమ్మడు ఫారెన్ టూర్స్ ఎక్కువగా చేస్తూ కనిపిస్తోంది. ఈవెంట్స్, షోస్ కోసం అక్కడికి వెళ్లడం అక్కడ ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన న్యూ అప్ డేట్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. "నా బిగ్గెస్ట్ ఫేవరేట్ సిటీ ఐన డల్లాస్ లో త్వరలో బ్యాండ్ ఎలీజియం అనే ఒక పెద్ద కన్సర్ట్ ని హోస్ట్ చేయబోతున్నాను.

ఎక్కడ అంటే 6300 ఫ్లయర్స్ వే, ఫ్రిస్కోకి వస్తున్నాను జూన్ 3 న మిమ్మల్నందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాం.. రెడీ ఉండండి" అంటూ ఒక అనౌన్స్మెంట్ ని కూడా ఇచ్చేసింది. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. వెంటనే తీసుకోండి అంటూ తన ఫాన్స్ తో ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుంది. అష్షు ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లోనే కాదు అప్పుడప్పుడు మంచి హోమ్లీ లుక్ లో కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా డల్లాస్ లో ఉంటున్న ఫ్రెండ్ దివ్య హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి చీరకట్టులో కనిపించి సందడి చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.