English | Telugu

ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమైన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మ ముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -66 లో కనకం-కృష్ణమూర్తిల ఇంటికి కొత్తగా పెళ్ళైన కావ్య-రాజ్ వస్తారు. ఇద్దరు కార్ దిగాక.. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో పదా అని రాజ్ అనగానే.. నేను పుట్టి పెరిగిన ఇంటి గురించి మీరు తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు, నేను లోపలికి రానని కావ్య అంటుంది. వెనక్కి వెళ్ళిపోదాం పదండని కావ్య అనగా‌‌.. ఇప్పుడేంటి.. ఏమన్నాను.. పోదాం పదా.. పదా వెళ్దామని రాజ్ గట్టిగా అరవగా.. అప్పు ఇంటిలోపలి నుండి బయటకొచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. అమ్మ అక్క వచ్చిందే అని చెప్పగా కనకం పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఇది నిజమా కలా అని కనకం ఆనందంతో ఉబ్బితబ్బి పోతుంది. కనకం కావ్యని హత్తుకుంటుంది. ఆ తర్వాత వీధిలోని చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరిని పిలుస్తుంది కనకం. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి రాజ్ కావ్యలని చూసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రాజ్-కావ్యలని లోపలికి రమ్మని పిలుస్తుంది కనకం.

రాజ్-కావ్య ఇంటిగుమ్మంలోకి అడుగుపెడుతుండగా ఆగండని చెప్పి హారతి రెడీ చేస్తుంది కనకం. ఆ తర్వాత లోపలికి వస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు ఆపుతారు. మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి వెళ్ళాలని అంటారు. రాజ్ కావ్య ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి వస్తారు. లోపలికి వచ్చాక కావ్య, వాళ్ళ నాన్న కృష్ణమూర్తిని చూసి ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంటుంది. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో అని భయపడ్డానమ్మ అని కృష్ణమూర్తి అనగా కావ్య ఏడుస్తుంది‌. అలా కాసేపు కనకం, అప్పు, కావ్య, కృష్ణమూర్తి ఏమోషనల్ అవుతారు. ఆ తర్వాత మీ లాంటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టమని కృష్ణమూర్తి అంటాడు.

మీ ఇల్లు చూపించరా అని రాజ్ అనగా.. మీ ఇల్లులా కాదు బాబు.. మీ ఇంట్లో స్టోర్ రూంలా ఉంటుంది మా ఇల్లు అని కనకం చెప్తుంది. కావ్య.. అల్లుడి గారిని లోపలికి తీసుకెళ్ళమ్మా, భోజనం సిద్దం చేసాక పిలుస్తానని కనకం చెప్తుంది. లోపలికి వెళ్ళాక అన్నీ పాత సామాన్లు చూసి విసుక్కుంటాడు రాజ్. పాత ఫ్యాన్, పాత బెడ్ అని ఇబ్బంది పడుతుంటాడు రాజ్. మరోవైపు రాజ్ వాళ్ళ ఇంట్లో అందరూ హాల్లో ఉండగా.. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ సూట్ కేస్ తో వచ్చి ఇక సెలవని చెప్తుంది. ఇప్పుడు ఏమైందని రాజ్ వాళ్ళ నాన్న అడుగగా.. "నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను.. మీతో వాదించలేను.. కారణం చెప్పాలా" అని అపర్ణ అనగా.. ఏం అయిందో చెప్పమని రాజ్ వాళ్ళ నాన్న అంటాడు. నా ఇంట్లోనే నాకు అవమానం జరిగింది. నా ఆత్మగౌరవం దెబ్బతింది అని అపర్ణ అనగా.. ఈ ఇల్లు నీ ఇల్లు ఎప్పుడయిందని రాజ్ నానమ్మ అడుగగా.. నీ కొడుకు నా మెడలో తాళి కట్టినప్పుడని అపర్ణ అంటుంది. నీ కొడుకు కూడా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు.. ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని ఎన్నిసార్లు నువ్వు దెబ్బతీయలేదని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.