English | Telugu

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లాస్య

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ లాస్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. తమకి కుమారుడు పుట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ హ్యాపీ న్యూస్ ని వెల్లడించింది. "మా జీవితాల్లో కొత్త ప్రేమని కలిసాం" అని కాప్షన్ పెట్టింది లాస్య. మార్చి 7న తమకు కుమారుడి పుట్టినట్టు హార్ట్ ఎమోజీస్ పెట్టి మరీ చెప్పింది. ఈ హ్యాపీ న్యూస్ ని ఓ చిన్న వీడియోని ద్వారా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది లాస్య. ఇందులో తన భర్త మంజునాథ్‌ తన రెండు చేతులు ఓపెన్‌ చేసి `ఇట్స్ ఏ` అని, లాస్య తన చేతులుతెరిచి `బేబీ` అని, జున్ను తన చేతులు తెరిచి `బాయ్‌` అని కొత్తగా ఈ విషయాన్ని చెప్పారు. చివరగా పుట్టిన బిడ్డ చేతిని చూపించారు. హోలీ కూడా రావడంతో ఈ ముగ్గురూ చేతులకు రంగులు పూసుకుని ఈ విషయాన్ని కలర్ ఫుల్ గా చెప్పేసారు. హోలీ స్పెషల్‌గా, ఉమెన్స్ డే రోజున తమ కుమారుడు పుట్టినట్టు ప్రకటించింది. లాస్య, మంజునాథ్‌ ప్రేమించుకుని సాహసం చేసి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సీక్రెట్ గా వివాహం చేసేసుకున్నారు.

జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ జంట ఇప్పుడు మాత్రం వెల్ సెటిల్ అయ్యింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ ప్రేమను, పెళ్లిని, పిల్లలను యాక్సెప్ట్ చేసి అందరూ కలిసిపోయారు. వీరికి ముందు ఒక కుమారుడు జున్ను జన్మించాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు లాస్య, మంజునాథ్‌ కు విషెస్ చెబుతున్నారు. లాస్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ లో రీల్స్, షార్ట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. తనతో పాటు తన భర్తని కూడా సెలబ్రెటీని చేసేసింది. మంజునాథ్ తో కలిసి వీడియోస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. సిరి హన్మంత్, గీతూ రాయల్, జ్యోతక్క, మై విలేజ్ షో అనిల్, గెటప్ శీను వైఫ్, శ్వేతనాయుడు, మెహబూబ్, సుష్మకిరణ్, రవికిరణ్ ఇలా బుల్లితెర యాక్టర్స్ అంతా కంగ్రాట్స్ చెప్పారు.