English | Telugu

శివాజీకి వెన్నుపోటు పొడిచిన అంబటి అర్జున్!


బిగ్‌బాస్ హౌస్‌‍లో పదమూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్‌లో ఉండగా ఇందులో ఏడుగురు నామినేషన్స్‌లోకి వచ్చారు. ఈ వారం కెప్టెన్ ఎవరు లేకపోయిన అమర్ దీప్ నామినేషన్స్‌ నుంచి సేవ్ అయ్యాడు.

నిన్న జరిగిన నామినేషన్ లో అంబటి అర్జున్ చేసిన నామినేషన్ వల్ల అతనే ఈ వారం ఎలిమినేట్ అయ్యేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతవారం జరిగిన కెప్టెన్సీ రేస్ లో ఫైనల్ గా అంబటి అర్జున్, అమర్ దీప్ ఉండగా.. అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ, అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి ఫైట్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టైమ్ లో ఇద్దరు డిసైడ్ కాలేకపోవడం వల్ల అది కాస్త ఫైనల్ గా బిగ్ బాస్ చేతికి వెళ్ళింది. దాంతో నో కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పేశాడు. ఇక్కడివరకు అంతా ఒకే కానీ.. అసలు విషయం ఏంటంటే నిన్నటి నామినేషన్ లో శివాజీని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. నామినేషన్ కి అర్జున్ కారణం చెప్తూ.. " నేను ఏదైతే రీజన్ రాకూడదని అనుకున్నానో అది నాగ్ సర్ దగ్గరి నుంచి వచ్చేసింది.. నేను పప్పీ రీజన్ చెప్పి కెప్టెన్ అవుదామనుకున్నానని నాగ్ సర్ అనేశారు" అంటూ అర్జున్ చెప్పాడు. దీంతో నాకు తెలిసి నువ్వు అడగలేదు నేనే వాలంటరీగా నీకు సపోర్ట్ చేశాను. ఒక ఆడపిల్ల విష్ కోసం నేను అలా నీ కోసం నిలబడ్డాను. నీకు నచ్చలేదంటే అప్పుడే చెప్పాల్సింది. దాదాపు మూడు గంటల పాటు శోభాశెట్టి, నేను ఫైట్ చేశాం. ఆ ఒక్క రీజన్ తో నేను రేస్ లో ఉండను అని నువ్వు చెప్పుంటే నేను అమర్ కి సపోర్ట్ చేసేవాడిని. ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా అని శివాజీ అన్నాడు. నచ్చలేదని కాదు.. ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడు జనాలు ఆడింది కాకుండా ఇదే గుర్తుపెట్టుకుంటారని అర్జున్ అన్నాడు. దీంతో ఓకే వేసుకో నామినేషన్ అని శివాజీ చెప్పేశాడు.

నామినేషన్ తర్వాత శివాజీ భోజనం చేస్తుండగా.. ప్రశాంత్ ఎమోషనల్ గా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. దానికి ముందు.. " జీవితంలో ఫస్ట్ టైమ్ భళే జర్క్ తిన్నానే" అని శివాజీ అన్నాడు. నిన్నటి నామినేషన్ లో కూడా.. నేను అనవసరంగా నమ్మానురా అంటు అంబటి అర్జున్ ని శివాజీ అన్నాడు. అర్జున్ చేసిన నామినేషన్ తో అతనిలోని కన్నింగ్ ప్రేక్షకులందరికి అర్థమైంది‌. గేమ్ బాగా ఆడతాడు. తప్పు చేయడని నమ్మిన శివాజీని వెన్నుపోటు పొడిచిన అంబటి అర్జున్ కి ఇది పెద్ద మైనస్ ‌అనే చెప్పాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.