English | Telugu

రాముడికి ఆదిరెడ్డి లక్ష విరాళం..జై శ్రీరామ్..


బిగ్ బాస్ హౌస్ లోకి రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగి పోయాయి. ఇప్పుడు ఆదిరెడ్డి తన ఉదారతను చాటుకున్నాడు. మనకు ఒక పది రూపాయలు వస్తే అందులో ఎంతో కొంత వేరేవాళ్లకు సాయం చేయాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనం ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండిపోతే వాటికి చెదలు పడతాయి తప్ప వాటికి విలువ పెరగదు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి.

మరి ఆ మాటలను నిజం చేస్తూ ఆదిరెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ నెల 22 న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర సంస్థ వారు దేశవ్యాప్తంగా విరాళాలని ఆహ్వానిస్తున్నారు.. చాలా మంది కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ డబ్బులు కూడా పంపిస్తున్నారు.

ఇక ఆ శ్రీరాముడి ఆశీస్సులు తన మీద తన కుటుంబం మీద అలాగే లోటస్ ల్యాండ్ మార్క్ లో పెట్టిన తన జావేద్ హబీబ్ సెలూన్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ఫామిలీ తరపున ఒక లక్ష రూపాయలను ఆ స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి చేసిన ఈ పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆదిరెడ్డికి దైవ భక్తితో ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు కూడా సాయం చేసే గుణం కూడా ఎక్కువే అంటున్నారు. రీసెంట్ గా రోడ్ సైడ్ చలిలో పడుకున్న వారి కోసం దుప్పట్లు, భోజనం వగైరా వంటివి పంపిణీ చేసాడు. ఆ పిక్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆదిరెడ్డి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.