English | Telugu

సోషల్ మీడియా కరోనా వైరస్ లాంటిది... పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్‌లో ఓపెన్‌గా పెట్టు!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఎంతలా తయారయ్యిందో అందరం చూస్తూనే ఉన్నాం. దాని మీద ఒక నియంత్రణ అనేది లేదు. దాని వలన చాలా నష్టాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఐతే అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు చెప్పాడు. "ఒక్క రోజు సీఎం ఐతే గనక సోషల్ మీడియా మొత్తాన్ని పీకి పారేస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసేస్తా. ఇన్స్టాగ్రామ్ మీదనే సంపాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అమ్మాయిల వీడియోస్ చూస్తుంటే వ్యూస్ కోసం ఫేమస్ కావటానికి అంత బరితెగించడం అవసరమా అనిపిస్తుంది. అలాంటి వీడియోస్ ని ఎవరైనా స్కూల్ కి వెళ్లే పిల్ల చూస్తే అలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన రాదా. ఈ సోషల్ మీడియా కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది కరోనా వైరస్ లాంటిదే.

ఏదైతే మనకు అనవసరమో ఆ కంటెంట్ మొత్తం తీసేస్తా. అమ్మాయైనా, అబ్బాయినా ఎక్స్పోజింగ్ లు చేసుకుంటూ ఏవన్నా అవి ఇవి చేసుకుంటూ ఉంటె గనక ఎక్స్ పోజింగ్ చేయొచ్చు కానీ ఒక పరిమితి ఉంటుంది. అడల్ట్ రేటింగ్ కంటే కిందకి ఉంటె చిన్న పిల్లలెవరైనా చేయడం చూస్తే నిర్మొహమాటంగా తీసుకొచ్చి పిర్రలు పేలేలా కొట్టిస్తా. మనకు కొంచెం జ్ఞానం ఉంది కదా. ఎంత వరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు అని చాలా మంది ఆ వీడియోస్ కి ఎడిక్ట్ ఐపోయి చెడిపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌.. దేనికి అది దేన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి వెళ్లి బూతు పురాణం మొత్తం అందులోనే ఉంటుంది. పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్ లో ఓపెన్ గా పెట్టు. ఎంతవరకు చేయాలో అంత చేస్తే చాలు. లేదంటే మనం పాడైపోయేది కాక పక్కవాళ్ళకు కూడా పాడు చేయడమే. అవి జరగకుండా జాగ్రత్త పడితే చాలు." అన్నాడు అమరదీప్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.